Virat Kohli Retirement News: టీ20 వరల్డ్ కప్‌ తరువాత ప్రస్తుతం టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ రెస్ట్ మోడ్‌లో ఉన్నాడు. టీమిండియా న్యూజిలాండ్‌ పర్యటన నుంచి కోహ్లీకి విశ్రాంతి లభించింది. అయితే శనివారం కోహ్లీ చేసిన పోస్ట్‌తో రిటైర్మెంట్ వార్తలు జోరందుకున్నాయి. టీ20ల్లో చివరి మ్యాచ్‌ ఆడేశాడా..? అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్ కోహ్లీ ఫ్యాన్స్‌ను భయాందోళనకు గురి చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'23 అక్టోబర్ 2022 నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. క్రికెట్‌లో ఇంతటి ఎనర్జీ గతంలో ఎన్నడూ కనిపించలేదు. ఎంతో అందమైన సాయంత్రం అది..' అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఆడిన చారిత్రాత్మక ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చివరి వరకు క్రీజ్‌లో నిలబడి జట్టును గెలిపించాడు. 82 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌కు మర్చిపోలేని విజయాన్ని అందించాడు. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ అక్టోబర్ 23న జరిగింది. ఈ తేదీ అత్యంత ప్రత్యేకమైనదని కోహ్లీ పేర్కొన్నాడు. ఆ మ్యాచ్ ముగిసిన అనంతరం పెవిలియన్‌కు నడుచుకుంటు వెళుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 


కోహ్లీ మైదానం నుంచి బయటకు వెళుతున్న ఫోటోను చూసి అభిమానులు రిటైర్మెంట్ ప్రకటించేందుకు హింట్ ఇచ్చాడా..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
టీ20 ఫార్మాట్‌ నుంచి సీనియర్లు తప్పుకోవాలని డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలో కోహ్లీ పోస్ట్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. అందులోనూ పెవిలియన్‌కు తిరిగి నడుచుకుంటూ వెళుతూ.. అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన తేదీని గుర్తుచేయడం అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది.


దయచేసి 2027కి వరకు రిటైర్మెంట్ ప్రకటించవద్దని అభిమానులు కోరుతున్నారు. 'అన్నయ్య, అలాంటి పోస్ట్ పెట్టవద్దు. మీరు రిటైర్మెంట్ ప్రకటించారమోనని గుండె వేగంగా కొట్టుకుంది.' అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. 'ఇలా పోస్ట్ చేసి నన్ను 10 సెకన్ల పాటు భయపెట్టారు'మరో అభిమాని అన్నాడు. 


పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 82 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా స్కోరు ఒక దశలో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. అయితే విరాట్ కోహ్లి చివరి వరకు క్రీజ్‌లో నిలబడి భారత్‌ను గెలిపించాడు. కోహ్లీ ఆడిన ఈ అద్భుత ఇన్నింగ్స్‌ను క్రికెట్ అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.


Also Read: Sanju Samson: సౌత్‌ ప్లేయర్ అని వివక్ష.. రిషబ్ పంత్ కోసం సంజూ శాంసన్‌ కెరీర్ నాశనం చేసిన బీసీసీఐ!  


Also Read: Minister KTR: మంత్రి కేటీఆర్ పరువు తీసిన ఎమ్మెల్యే.. సాయంత్రానికి మారిపోయిన సీన్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook