న్యూఢిల్లీ: టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీకి గురుగ్రామ్ నగర్ నిగమ్ అధికారులు రూ.500 జరిమానా విధించారు. తాగు నీటితో కార్లను శుభ్రం చేసి మంచి నీటిని వృథా చేసినందుకుగాను అక్కడి మున్సిపల్ అధికారులు కోహ్లికి ఈ జరిమానా విధించారు. గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ ఫేజ్-1లోని విరాట్ కోహ్లీ నివాసంలో దాదాపు అర డజన్ వరకు కార్లు ఉండగా ఆ కార్లను శుభ్రం చేయడానికి కోహ్లి ఇంటి పనివారు మంచి నీటిని వృథా చేస్తున్నారని ఇంటి యజమాని కోహ్లీకి చలాన్ పంపారు. కోహ్లి ఇంటి ముందు పార్క్ చేసిన కార్లను మంచి నీటితో శుభ్రం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పక్కింటివారు ఇచ్చిన ఫిర్యాదుతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. 


దక్షిణాఫ్రికాపై విజయంపై విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే..


ఇక ప్రపంచ కప్‌లో టీమిండియా ప్రస్థానం విషయానికొస్తే, సౌతాఫ్రికాపై ఘన విజయం అనంతరం ఆదివారం ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది.