దక్షిణాఫ్రికాపై విజయంపై విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే..

దక్షిణాఫ్రికాపై విజయంపై విరాట్ కోహ్లీ స్పందన

Last Updated : Jun 6, 2019, 03:19 PM IST
దక్షిణాఫ్రికాపై విజయంపై విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే..

సౌతాంప్టన్: ఐసిసి ప్రపంచ కప్‌లో ఆడిన తొలి ఆటలోనే దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించడంపై టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ జట్టులోని ఆటగాళ్ల సమిష్టి కృషిని అభినందించాడు. దక్షిణాఫ్రికాపై రోహిత్ శర్మ సెంచరీ చేసిన తీరును ఎంతో ప్రశంసించిన విరాట్ కోహ్లీ.. రోహిత్ చాలా గొప్పగా ఆడాడని అన్నాడు. అలాగే భారత బౌలర్స్ కూడా సఫారీలను కట్టడి చేసే విధంగా బౌలింగ్ చేయడంలో విజయం సాధించారని కోహ్లీ పేర్కొన్నాడు. అయితే, ఇదేమీ అంత కష్టతరమైన లక్ష్యం కాదని, ఇటీవల కాలంలో ఆడుతున్న వన్డేల్లో సాధించిన భారీ లక్ష్యాలతో పోల్చితే ఇది అంత ఎక్కువ స్కోర్ కానే కాదని కోహ్లీ స్పష్టంచేశాడు. సౌతాంప్టన్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ విరాట్ కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

సౌతాంప్టన్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Trending News