Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సీనియర్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) పై ఫన్నీ వీడియో చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్టుచేశాడు. ధావన్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ను అనుకరిస్తూ వీడియో తీసిన కోహ్లీ(Virat Kohli) దాన్ని అభిమానులతో పంచుకొని నవ్వులు పూయించాడు. ప్రస్తుతం జట్టులో ధావన్‌ తన స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడి బ్యాటింగ్‌ స్టైల్‌ ఎలా ఉంటుందో చూపిస్తూ సరదాగా నవ్వులు పూయించేందుకు ఇలా చేసినట్లు కోహ్లీ చెప్పాడు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గబ్బర్‌( Shikhar Dhawan)బ్యాటింగ్‌ స్టైల్‌ను తాను పలుమార్లు గమనించానని, అది సరదాగా ఉంటుందనే ఈ వీడియో చేసినట్లు కోహ్లీ(Virat Kohli) చెప్పాడు. ఇక ఆ వీడియో చూసిన అభిమానులు సరదాగా ఉందంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ధావన్‌ బ్యాటింగ్‌ చేసేటప్పుడు తన భుజాల దగ్గర జెర్సీని ఎలా సర్దుకుంటాడో కోహ్లీ అచ్చం అలాగే చేసి అభిమానులను అలరించాడు. 


Also read: Prithvi Shaw: ఖరీదైన కారు కొన్న ఢిల్లీ ఓపెనర్...ధర ఎంతంటే..


ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2021లో దిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals) తరఫున ధావన్‌ 16 మ్యాచ్‌ల్లో 587 పరుగులతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో అతడు అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. అయినా, అతడిని టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడం గమనార్హం. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి