Virat Kohli Not Out: అంపర్లకు కళ్లు దొబ్బాయా.. విరాట్ కోహ్లీ ఔట్‌పై మండిపడుతున్న భారత ఫాన్స్! పిక్స్ వైరల్
Fans Trolls Umpire Nitin Menon after Virat Kohli Out in IND vs AUS 2nd Test. సెంచరీ చేసేలా కనిపించిన విరాట్.. హాఫ్ సెంచరీ చేయకుండానే అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు.
Team India Fans Fires Poor Umpiring in IND vs AUS 2nd Test after Virat Kohli Out: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 26 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 12 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మొదటి టెస్టులో విఫలమయిన కోహ్లీ.. ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో మాత్రం కీలక ఇన్నింగ్స్ (44; 84 బంతుల్లో 4 ఫోర్లు) ఆడాడు. సెంచరీ చేసేలా కనిపించిన విరాట్.. హాఫ్ సెంచరీ చేయకుండానే అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
రెండోరోజైన శనివారం భారత్ ఇన్నింగ్స్ 50 ఓవర్‌ను ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్ వేశాడు. కుహ్నెమన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ ప్యాడ్‌ను తాకింది. ఆసీస్ ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్ చేయడం, ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ ఔట్ ఇవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయి. అంపైర్ అవుట్‌గా ప్రకటించిన వెంటనే కోహ్లీ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. టీవీ రిప్లైలో ప్యాడ్ కంటే ముందే బ్యాట్‌కి తగిలినట్లు స్పష్టంగా తేలింది. అయినా కూడా థర్డ్ అంపైర్ 'బెన్‌ఫిట్ ఆఫ్ డౌట్' కింద ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు.
థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని స్క్రీన్‌పై చూసిన విరాట్ కోహ్లీ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అదెలా ఔట్ అంటూ తల అడ్డంగా ఊపుతూ కోహ్లీ పెవిలియన్‌కు వెళ్లాడు. కోహ్లీ వికెట్ విషయంలో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కోహ్లీ వికెట్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారత అభిమానులు అంపైర్‌పై మండిపడుతున్నారు. 'చెత్త అంపైరింగ్', 'కళ్లు కనిపించడం లేదా', 'అంపర్లకు కళ్లు దొబ్బాయా' అంటూ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫీల్డ్ అంపైర్ నితీన్ మీనన్‌పై భారత అభిమానులు మండిపడుతున్నారు. కోహ్లీ విషయంలో నితీన్ మీనన్ తప్పు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలానే ఔట్ ఇచ్చాడు. విరాట్ ఔట్ నిర్ణయంపై టీమిండియా మాజీ ఆటగాళ్లు అభినవ్ ముకుంద్, వసీం జాఫర్ స్పందించారు. కోహ్లీ ఔట్ కాదు, స్పష్టంగా బంతి బ్యాట్‌కు తాకింది, థర్డ్ అంపైర్ నిర్ణయంపై చాలా సందేహాలు ఉన్నాయి అని వారు తమ సోషల్ మీడియా ఖాతాలలో పేర్కొన్నారు. ఇక 74 ఓవర్లకు భారత్ స్కోరు 222/7. అక్షర్ పటేల్ (43), ఆర్ అశ్విన్ (31) క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 41 రన్స్ వెనకబడి ఉంది.
Also Read: Shani Uday 2023: శని ఉదయం 2023.. మార్చి 5 నుంచి ఈ రాశుల వారిని వరించనున్న అదృష్టం! వివాహం అవుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.