Shani Uday 2023: శని ఉదయం.. మార్చి 5 నుంచి ఈ రాశుల వారిని వరించనున్న అదృష్టం! వివాహం అవుతుంది

Libra Zodiac Sign Peoples may get marriage proposals Due to Shani Uday 2023. శని పెరుగుదల వల్ల కొన్ని రాశుల వారిని అదృష్టం వరిస్తుంది. వారికి చాలా డబ్బు చేతికి వస్తుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 18, 2023, 02:49 PM IST
  • శని దేవుడు ఉదయం 2023
  • మార్చి 5 నుంచి ఈ రాశుల వారికి అదృష్టం
  • ఈ రాశి వారికి వివాహం అవుతుంది
Shani Uday 2023: శని ఉదయం.. మార్చి 5 నుంచి ఈ రాశుల వారిని వరించనున్న అదృష్టం! వివాహం అవుతుంది

Libra Zodiac Sign Peoples may get marriage proposals Due to Saturn Rise 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... శని దేవుడు కర్మలను ఇచ్చే ప్రదాతగా పరిగణిస్తారు. ప్రతి రాశి వారికీ వారి కర్మల ప్రకారం ఫలాలను ఇస్తాడు. శని 30 సంవత్సరాల తర్వాత కుంభ రాశిలో సంచరించాడు. జనవరిలోనే కుంభ రాశిలోకి శని ఎంట్రీ ఇచ్చాడు. దాంతో కొన్ని రాశుల వారు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మానసిక, శారీరక మరియు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇప్పుడు శని దేవుడు మార్చి 5 రాత్రి 8.38 గంటలకు ఉదయిస్తాడు. శని పెరుగుదల వల్ల కొన్ని రాశుల వారిని అదృష్టం వరిస్తుంది. వారికి చాలా డబ్బు చేతికి వస్తుంది. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. 

మకర రాశి:
మకర రాశి జాతకంలో రెండవ భాగంలో శని దేవుడు ఉదయిస్తాడు. శని ఎదుగుదల ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసొస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.

తులా రాశి:
తులా రాశి వారికి శని దేవుని ఉజ్జీవంతో అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. వ్యాపారం మరియు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు.

సింహ రాశి:
శని దేవుడు ఉదయించి వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను ఇస్తాడు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగం కోసం అన్వేషణలో ఉన్న వారు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏదైనా కొత్త పని ప్రారంభించవచ్చు. వైవాహిక జీవితం బాగుంటుంది.

వృషభ రాశి:
వృషభ రాశి వారికి శని ఉదయించడం వల్ల మేలు జరుగుతుంది. ఈ రాశి వారికీ మంచి సమయం మొదలై పలు విధాలుగా లాభపడతారు. జీవితంలో ఆనందం వస్తుంది. వృషభ రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది.

Also Read: Realme C35 Flipkart Offers: రియల్‌మీ సీ35 స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని ఆఫర్.. రూ. 600కే ఇంటికి తీసుకెళ్లండి!  

Also Read: Mahashivrari 2023: మీ కోరిక నెరవేరాలంటే.. మహా శివరాత్రి నాడు ఈ 10 పరిహారాల్లో ఏదో ఒకటి ''ఒక్కటైనా'' చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News