Realme C35 Flipkart Offers: రియల్‌మీ సీ35 స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని ఆఫర్.. రూ. 600కే ఇంటికి తీసుకెళ్లండి!

Realme C35 5G SmartPhone Purchase only Rs 600  in Flipkart. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ సీ35 (Realme C35)ని కేవలం రూ. 600కి ఆర్డర్ చేయవచ్చు.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 18, 2023, 02:10 PM IST
  • రియల్‌మీ సీ35 స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని ఆఫర్
  • రూ. 600కే ఇంటికి తీసుకెళ్లండి
  • రియల్‌మీ సీ35 అసలు ధర రూ. 14,999
Realme C35 Flipkart Offers: రియల్‌మీ సీ35 స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని ఆఫర్.. రూ. 600కే ఇంటికి తీసుకెళ్లండి!

Buy Realme C35 5G SmartPhone Just Rs 600 in Flipkart: మీరు మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. మీకు సరైన సమయం ఇదే. ఎందుకంటే రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌లపై సేల్ ప్రారంభమైంది. బెస్ట్ రియల్‌మీ ఫోన్‌ను మీరు చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ సీ35 (Realme C35)ని కేవలం రూ. 600కి ఆర్డర్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేసే ముందు మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ సీ35 (గ్లోయింగ్ గ్రీన్, 128GB, 4GB RAM) అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 14,999. మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే 13% తగ్గింపును పొందవచ్చు. డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్‌ ధర రూ. 12,999లుగా ఉంటుంది. అయితే రియల్‌మీ సీ35 ధరను మరింత తగ్గించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై పలు బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ చెల్లింపులపై రూ. 1000 తగ్గింపు ఆఫర్ ఉంది. అలాగే మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కార్డ్ నో కాస్ట్ ఈఎంఐలో కొనుగోలు చేయవచ్చు. మీరు ఎస్బీఐ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌ చెల్లింపుపై రూ. 1000 తగ్గింపును కూడా పొందవచ్చు. ఇక ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద ప్రత్యేక తగ్గింపును పొందవచ్చు. మీరు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ ఇస్తే రూ.11,800 తగ్గింపును పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే.. రియల్‌మీ సీ35పై కేవలం రూ. 600 లకు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. 

కంపెనీ రియల్‌మీ సీ35 స్మార్ట్‌ఫోన్‌ను 2022 ఫిబ్రవరి 14న విడుదల చేసింది. ఇది GSM / HSPA / LTE నెట్‌వర్క్‌లలో పనిచేస్తుంది. స్క్రీన్ 6.6 అంగుళాలు, 1080 x 2408 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ ఫోన్ పాండా గ్లాస్‌.. Android 11, Realme UI 2.0 ద్వారా పని చేస్తుంది. C35 ఫోన్ ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. 50 MP బ్యాక్, సెల్ఫీ కోసం 8MP సెన్సార్ కెమెరా ఇవ్వబడింది. ఈ ఫోన్ Li-Po 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 

Also Read: Mahashivrari 2023: మీ కోరిక నెరవేరాలంటే.. మహా శివరాత్రి నాడు ఈ 10 పరిహారాల్లో ఏదో ఒకటి ''ఒక్కటైనా'' చేయండి!

Also Read: Cheapest SUV India 2023: 6 లక్షల రేంజ్‌లో బెస్ట్ ఎస్‌యూవీ.. మైలేజ్ సూపరో సూపర్! ఫీచర్లు ఇవే  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News