Virat Kohli says I will cut big Cake If  India Lift T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ జట్లపై హాఫ్ సెంచరీలు బాది టీమిండియాకు అద్భుత విజయాలు అందించాడు. కోహ్లీ తనదైన ఆట తీరుతో పొట్టి టోర్నీలో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఇక ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను నెలకొల్పిన కోహ్లీ.. శనివారం 34వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. దీంతో కింగ్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు, ఫాన్స్ బర్త్‌ డే విషెస్‌ చెప్పారు. భారత్ ఆటగాళ్లు  డ్రెస్సింగ్‌ రూమ్‌లో కేక్‌ కట్‌ చేయించి బర్త్‌ డేని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఈరోజు మెల్‌బోర్న్‌ వేదికగా జింబాబ్వేతో భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం శనివారం స్టేడియంలో భారత జట్టు ప్రాక్టీస్‌ చేసింది. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన పలువురు జర్నలిస్టులు బర్త్‌డే బాయ్ విరాట్ కోహ్లీని కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం భారత జర్నలిస్టులు కోహ్లీతో కేక్‌ కట్‌ చేయించి సంబరాలు చేశారు. కేక్‌ కట్‌ చేయించిన అనంతరం భారత మాజీ కెప్టెన్ కోహ్లీతో వారు కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్ 2022ను భారత్ గెలిస్తే తాను ఏం చేస్తానో చెప్పాడు. 



టీ20 ప్రపంచకప్‌ 2022లో భారత్‌ విజేతగా నిలిస్తే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని జర్నలిస్టులు అడగ్గా... 'ఇప్పుడు మీతో (జర్నలిస్టులతో) చిన్న కేక్‌ కట్‌ చేస్తున్నాను. నవంబర్‌ 13న జరిగే ఫైనల్లో భారత్ టీ20 ప్రపంచకప్‌ గెలిస్తే పెద్ద కేక్ కట్‌ చేసి సంబరాలు చేసుకుంటా. కేక్‌ కట్‌ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం' అని విరాట్‌ కోహ్లీ బదులిచ్చాడు. ఇక తన పుట్టినరోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేయించిన జర్నలిస్టులకు విరాట్ కృతజ్ఞతలు చెప్పాడు. 



Also Read: Shannu-Deepthi : ఇంకా డిప్రెషన్‌లోనే ఉన్నాడా?.. దీప్తిని మరిచిపోలేకపోతోన్న షన్ను


Also Read: Jabardasth Somya Rao Hot Photos: జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యా రావు అందాల విందు.. ఫోటోషూట్ చూశారా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి