Shannu-Deepthi : బిగ్ బాస్ ఇంట్లో జరిగిన విషయాలు బయట జీవితం మీద ఎంతగా ప్రభావం చూపిస్తుందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షణ్ముఖ్ జశ్వంత్ ఆడిన ఆట, చేసిన పిచ్చి చేష్టలు, సిరితో రొమాన్స్ వల్ల అతని జీవితం మొత్తం మారిపోయింది. బిగ్ బాస్ ఐదో సీజన్‌లో సిరి, షన్నులు నానా రచ్చ చేశారు. ఈ ఇద్దరూ హగ్గులు, కిస్సులకు ఫేమస్ అయ్యారు. దీంతో బిగ్ బాస్ ఇంట్లో చేసిన రచ్చకు బయట జీవితం తలకిందులైంది. బిగ్ బాస్ ఇంట్లో షన్ను ఉన్నన్ని రోజులు దీప్తి సునయన బాగానే సపోర్ట్ చేసింది.
కానీ సిరి విషయంలో మాత్రం షన్ను హద్దులు దాటడాన్ని తట్టుకోలేకపోయింది. దీంతో షన్ను బయటకు వచ్చాక అసలు విషయాన్ని చెప్పేసింది. దీప్తి ఒక్కసారిగా నెట్టింట్లో బ్రేకప్ పోస్ట్ పెట్టేసింది. మేం ఇద్దరం ఇకపై జీవితాన్ని కలిసి కొనసాగించలేమంటూ బ్రేకప్ చెబుతున్నట్టుగా దీప్తి సునయన చెప్పేసింది. కానీ షన్ను మాత్రం దీప్తికి ఇంకా బ్రేకప్ చెప్పలేదు. ఆమె కోసం ఎదురుచూస్తున్నట్టుగానే కనిపిస్తోంది.
షన్ను బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక దీప్తి కలవలేదు. కనీసం షన్ను ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదట. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకుందని షన్ను చెప్పుకొచ్చాడు. అలా మొత్తానికి షన్ను మాత్రం దీప్తిని కలిసేందుకు బాగానే ట్రై చేశాడు. దీప్తియే తన మనసు మార్చుకుంటుందని వెయిట్ చేశాడు. అయితే ఇంకా షన్ను ఆమె ధ్యాసలోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది.
షన్ను అన్నీ మరిచిపోయి తన పని తాను చేసుకుంటూ కెరీర్ మీద ఫోకస్ పెట్టినట్టున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం షన్ను ఇంకా డిప్రెషన్‌లోనే ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇంటి బాల్కనీ మీద నిల్చుని ఒంటరిగా బాధపడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇది ఒక దశ మాత్రమే.. ఇది కూడా తొలిగిపోతుంది..బాధలు సమసిపోతాయ్ అన్నట్టుగా షన్ను పోస్ట్ వేశాడు.
Also Read : Teja on Uday Kiran: చేయాల్సిందంతా చేసి కాళ్లు పట్టుకోవడానికి వచ్చాడు.. క్షమించనని చెప్పా!
Also Read : Ram Charan - Vishwaksen : విశ్వక్ సేన్ కారెక్టర్ ఇదేనా?.. రామ్ చరణ్‌వి ఒట్టి మాటలేనా?.. కెరీర్ మీద మచ్చ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook