ఐపీఎల్ పదకొండవ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఓటములు కొనసాగుతూనే ఉన్నాయి. అచ్చొచ్చిన సొంత మైదానం చిన్నస్వామిలో ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లోనూ ఆ జట్టు  ఓటమిపాలైంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో బెంగళూరుకిది ఐదో పరాజయం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



 


అయితే.. కోల్‌కతా ఇన్నింగ్స్ ఆఖర్లో విరాట్ కోహ్లీ పట్టిన క్యాచ్ మాత్రం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. మహ్మద్ సిరాజ్ వేసిన 19వ ఓవర్ ఐదో బంతిని దినేశ్ కార్తీక్ లాంగ్ ఆన్‌లో భారీ షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్‌లో ఉన్న కోహ్లీ మెరుపు వేగంతో డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. అప్పటికే బెంగళూరు జట్టు ఓటమిపాలైంది. దీంతో ఆర్‌సీబీకీ పెద్ద వికెట్ దక్కినా విరాట్ మాత్రం నిరాశతోనే బంతిని బౌలర్ వైపు విసిరేశాడు.




 



కొహ్లీ క్యాచ్ పడుతున్న సమయంలో మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన వారు సందడి చేశారు. అయితే ఇదంతా గ్యాలరీలో నుంచి చూస్తున్న అనుష్క శర్మ ఎలాంటి సందడి లేకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. కీలక సమయంలో క్రీజులో ఉన్న దినేశ్ కార్తీక్ కేవలం 10 బంతుల్లోనే 2 ఫోర్లు,1 సిక్స్ సాయంతో 23 పరుగులు సాధించి కోల్‌కతాను విజయతీరాలకు చేర్చాడు.




 


ఓటములు మమ్మల్ని వీడటం లేదు: కోహ్లీ


ఓటములు తమను వీడటం లేదని కొహ్లీ కూడా అన్నారు. ఈ సీజన్‌లో తాము ఆడుతున్న ప్రతి మ్యాచ్ ఫలితం తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఆర్‌సీబీ జట్టు కెప్టెన్ కొహ్లీ అన్నారు. అనుకున్న దాని కన్నా మంచి స్కోర్ చేసినా తమను ఓటములు వీడం లేదని తెలిపాడు. నాటి మ్యాచ్‌లలో తమ ఓటములకు ప్రధాన కారణం ఫీల్డింగ్ అని, సింగిల్స్ బౌండరీలుగా వెళ్తుంటే తాము ఆపలేకపోయామని పేర్కొన్నారు. ఇలానే ఆడితే తాము విజయానికి అర్హులం కాదని స్పష్టం చేశారు.