Virat Kohli Centuries: విరాట్ కోహ్లీ 100 కాదు.. 110 సెంచరీలు చేస్తాడు! షోయబ్ అక్తర్ జోస్యం
Shoaib Akhtar says Virat Kohli to break Sachin 100 centuries record. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 100 శతకాలు కాదు.. ఏకంగా 110 సెంచరీలు చేస్తాడు అని అక్తర్ జోస్యం చెప్పాడు.
Shoaib Akhtar says Virat Kohli will Score 110 Centuries: రెండు సంవత్సరాల పాటు ఫామ్ లేమితో సతమతం అయిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. గతేడాది ఆసియా కప్ ద్వారా ఫామ్ అందుకున్నాడు. ఆపై టీ20, వన్డేలలో సెంచరీలు బాదాడు. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో సెంచరీతో అన్ని ఫార్మాట్లలోనూ ఫామ్‌లోకి వచ్చేశాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 75 అంతర్జాతీయ శతకాలు ఉన్నాయి. ఇందులో 46 వన్డే సెంచరీలు, 28 టెస్టు సెంచరీలు, ఒక టీ20 సెంచరీ ఉంది. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 100 శతకాల రికార్డును కోహ్లీ అందుకుంటాడా? లేదా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
మూడేళ్ల పాటు విరాట్ కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగిస్తే.. 100 సెంచరీలు బాదడం పెద్ద కష్టమేం కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా స్పందించాడు. కోహ్లీ 100 శతకాలు కాదు.. ఏకంగా 110 సెంచరీలు చేస్తాడు అని అక్తర్ జోస్యం చెప్పాడు. సచిన్ రికార్డును అధిగమించడమే కాదు.. 110 సెంచరీలను కూడా సాధిస్తాడనే నమ్మకం తనకు ఉందన్నాడు. కోహ్లీ పరుగుల దాహం తీరనిది అని అక్తర్ పేర్కొన్నాడు.
'విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. అయితే ఫామ్‌లోకి రాడవం అనేది కొత్త కాదు. గతంలో కెప్టెన్సీ ఒత్తిడితో కోహ్లీ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు మానసికంగా స్వేచ్ఛగా ఉన్నాడు. తప్పకుండా విరాట్ మరింత ఫోకస్‌తో క్రికెట్ ఆడతాడు. సచిన్ టెండ్యూలర్ రికార్డును అధిగమించడమే కాదు.. 110 సెంచరీలను కూడా చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది. ఇక నుంచి బీస్ట్‌లా పరుగులు చేస్తాడు' అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అన్నాడు.
'సచిన్ టెండ్యూలర్ వికెట్‌ను తీస్తానని ఓ సందర్బాల్లో మా జట్టు సభ్యులకు చెప్పా. కోల్‌కతా వేదికగా జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లో తొలి బంతికే సచిన్ వికెట్‌ను తీశా. దాదాపు లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో ఔట్ చేశాను. అది నా జీవితంలో మరిచిపోలేని సంఘటన. సచిన్ ఔటైన తర్వాత స్టేడియం మొత్తం ఖాళీ అవడం నాకు ఇప్పటికీ గుర్తుంది' అని షోయబ్ అక్తర్ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.
Also Read: Top SUVs Under 10 Lakhs: 10 లక్షల లోపు టాప్ ఎస్‌యూవీలు.. పంచ్, నెక్సాన్, బ్రెజ్జాతో సహా థార్ కూడా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.