టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ శునక ప్రేమికుడిగా మారాడు. నాగపూర్‌లోని విదర్భా క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో జరగబోయే రెండవ టెస్టు కోసం ప్రాక్టీసు చేస్తున్న విరాట్ కోహ్లీ అక్కడి సెక్యూరిటీ కుక్కలతో కొంచెం సేపు ఆడుకున్నారు. ఇటీవలే ఆయన బెంగుళూరులో 15 వీధికుక్కలను దత్తత తీసుకున్నారు. అందులో కొన్ని గుడ్డి కుక్కలు కూడా ఉన్నాయి. జీవ కారుణ్యమంటే ఎంతో ఇష్టపడే కోహ్లీ అప్పుడప్పుడు జంతుహక్కులకు సంబంధించిన కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటారు. కోహ్లీ శునకాలపై చూపిస్తున్న ప్రేమను ఇటీవలే బీసీసీఐ తన ట్విటర్ పేజీలో పంచుకుంది. ఆయన మానవత్వాన్ని కొనియాడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శునకాలతో సెల్ఫీలు కూడా తీసుకుంటూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు కోహ్లీ. బ్రూనో అనే పేరు గల కుక్కను ఎన్నో ఏళ్ళుగా కోహ్లీ పెంచుకుంటున్నారు కూడా. తన ఇంటిలో ఒక సభ్యుడిగా దానిని చూసుకుంటూ ఉంటారట. గతంలో కోహ్లీ జంతు హక్కుల పరిరక్షణ సంస్థ పెటాకి మద్దతుగా కూడా నిలిచారు. ఆ సంస్థతో కలిసి తమిళనాడులో జల్లికట్టు ఆటను నిషేదించాలని కూడా కోరారు. ఈ విషయంపై కేంద్రప్రభుత్వానికి పెటా రాసిన ఉత్తరంపై తను కూడా సంతకం చేశారు.