Hardik Pandya Emotional: సన్‌రైజర్స్ సూపర్ విక్టరీ.. కన్నీళ్లు పెట్టుకున్న హార్దిక్ పాండ్యా, వీడియో వైరల్
Hardik Pandya: ఐపీఎల్లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిన పోవడంతో పాండ్యా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Hardik Pandya gets Emotional After SRH Match: ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కాకముందే నుంచే హార్ధిక్ పాండ్యా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి బయటకు రావడం, రోహిత్ ను కాదని పాండ్యాకు పగ్గాలు అప్పగించడంతో అతడిపై ట్రోలింగ్ మెుదలైంది. తొలి మ్యాచ్ లో చెన్నై చేతిలో ఓడిపోవడం, రోహిత్ ను బౌండరీ లైఫ్ వద్ద పరిగెత్తించడం వంటి చర్యలతో అది తారాస్థాయికి చేరింది.
తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ముంబై ఓడిపోవడంతో పాండ్యాపై ట్రోల్స్, మీమ్స్ శృతిమించిపోయాయి. హార్ధిక్ ను నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. హైదరాబాద్ దెబ్బకు పాండ్యా ఏడ్చేసినంత పనిచేశాడు. తన సహచర ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలో పాండ్యా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
బుధవారం ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో ముంబై బౌలర్లను ఊచకోత కోశారు సన్ రైజర్స్ బ్యాటర్లు. వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్ లోకి పంపారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, మార్క్ క్రమ్ రెచ్చిపోవడంతో సన్ రైజర్స్ రికార్డు స్థాయి స్కోరు చేసింది. ఐపీఎల్ హిస్టరీలోనే 277 పరుగుల అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఈ సీజన్ లో ఫాస్టెస్టె హాఫ్ సెంచరీని నమోదు చేశారు ట్రావిస్ హెడ్.
అనంతరం లక్ష్యఛేదనను ప్రారంభించిన ముంబై కూడా గట్టిపోటీనే ఇచ్చింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (64) చెలరేగి ఆడాడు. టిమ్ డేవిడ్(42), ఇషాన్ కిషన్(34) కూడా రాణించారు. కమిన్స్, జయదేవ్ ఉనద్కత్ చెరో రెండు వికెట్లు తీశారు.
Also Read: SRH Sentiment: ఆరెంజ్ ఆర్మీకు ఆసిస్ కెప్టెన్ల సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా
Also Read: SRH vs MI Live Score: చరిత్ర తిరగరాసిన సన్‌రైజర్స్.. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook