Kohli Duplicate Video viral: నిన్న(జనవరి 22) అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న సినీ, క్రీడా, వ్యాపార మరియు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హాజరుకాలేదు, కానీ అతడి డూప్లికేట్(Kohli Duplicate)  మాత్రం వచ్చాడు. అయితే అతడు కోహ్లీ డూప్ అనీ తెలియక అభిమానులు అతడితో సెల్ఫీలు, వీడియోలు దిగేందుకు ఎగబడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మ‌రోవైపు క్రికెట‌ర్ కోహ్లీ.. ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌నున్న తొలి రెండు టెస్టుల‌కు దూరం కానున్న విష‌యం తెలిసిందే. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కోహ్లీ ఆ మ్యాచ్‌ల‌కు అందుబాటులో ఉండటం లేదు. అయితే ఏ కార‌ణం చేత అత‌ను టెస్టుల‌కు దూరమయ్యాడనే విషయం తెలియరాలేదు. ఈనెల 25వ తేదీ నుంచి హైద‌రాబాద్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఐదేళ్ల తర్వాత భాగ్యనగరం టెస్టుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ ను స్కూల్‌ స్టూడెంట్స్‌తోపాటు ఆర్మీ జవాన్లకు ఉచితంగా మ్యాచ్‌ను వీక్షించే అవకాశం కల్పించింది హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ). 


ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు విశాఖ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు 3వ టెస్టు, ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో 4వ టెస్టు జరగనుంది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే 5వ టెస్టుతో సిరీస్ ముగుస్తుంది. 


Also Read: ICC Best Team: కోహ్లీ, రోహిత్‌కు ఐసీసీ షాక్.. 2023 టీ20 అత్యుత్తమ జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌


Also Read: Virat Kohli: టీమిండియాకు బిగ్‌ షాక్.. ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter