Sun Risers Hyderabad New Anthem Out: ఐపీఎల్ ప్రారంభానికి ముందు సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. ‘సన్‌ రైజర్స్‌ మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్‌ బ్రో..’ అంటూ సాగే కొత్త ఆంథెమ్‌ను విడుదల చేసింది. ఈ మాస్ బీట్ ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. ఇవాళ ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా విడుదల చేసింది ఎస్‌ఆర్‌హెచ్‌. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పాటలో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్ పాట్ కమిన్స్,  భువనేశ్వర్‌ కుమార్‌, ఎయిడెన్‌ మార్క్‌రమ్‌, ట్రావిస్‌ హెడ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అభిషేక్‌ వర్మ, ఉమ్రాన్‌ మాలిక్‌, రాహుల్‌ త్రిపాఠిలతో పలువురు క్రికెటర్లు సందడి చేశారు. ఈ సాంగ్ లో హైదరాబాద్ లోని కొన్ని చారిత్రక ప్రదేశాలను కూడా చూపించారు. సన్ రైజర్స్.. మార్చి 23న కేకేఆర్ తో జరగబోయే మ్యాచ్ ద్వారా టైటిల్ వేట షురూ చేయనుంది. ఆరెంజ్ జట్టు మార్చి 27న ముంబై ఇండియన్స్ తో, 31న గుజరాత్ టైటాన్స్ తో, ఏప్రిల్ 05న చెన్నై సూపర్ కింగ్ తో ఆడనుంది. 



సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు: అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, పాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఝాతావేద్ సుబ్రమణ్యన్.



Also Read: IPL 2024: రింకూ సింగ్ నెవ్వర్ బిఫోర్ షాట్.. షాక్ లో స్టార్క్.. వీడియో వైరల్


Also Read: Virat Kohli: 'నన్ను అలా పిలవకండి'... ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేసిన కోహ్లీ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook