వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రేవో  ఇప్పటికి వరకు 106 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. నిజం చెప్పాలంటే... ఐపీఎల్ టోర్నిల్లో ఇన్ని మ్యాచ్‌లు ఆడి అత్యద్భుతమైన ఆటగాడిగా పలువురి మన్ననలను కూడా అందుకున్న బ్రేవో పై ఈసారి కూడా మంచి అంచనాలే ఉన్నాయి. బ్రేవో ఉంటే చాలు.. మ్యాచ్ గెలిచేస్తాం అన్నంత దీమాతో జట్లు ఉంటాయని వినికిడి. మరి అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఆటగాడిని ఏ జట్టు వదులుకుంటుంది. అందుకే ఈ సారి ఆయనను కైవసం చేసుకోవడానికి పోటీ బాగానే ఉంది. ఇప్పటి వరకు  చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్, ముంబయి ఇండియన్స్ జట్లపై ఆడిన బ్రేవో ఈసారి మరి ఏ జట్టు తరఫున ఆడతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు106 ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆడిన బ్రావో 100 వికెట్లు తీసాడు.