who is Sachin Das:  ప్రస్తుతం భారత క్రికెట్ లో మారుమోగుతున్న పేరు.. సచిన్ దాస్. అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియాను ఫైనల్ కు చేర్చడంతో ఈ యువ ఆటగాడు కీలకపాత్ర పోషించాడు. సౌతాఫ్రికాతో మంగళవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో సచిన్ దాస్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్ ను తొమ్మిదోసారి ఫైనల్ రేసులో నిలబెట్టాడు. తీవ్ర ఒత్తిడిలో కెప్టెన్ ఉదయ్ సహరన్‌తో కలిసి ఇతడు ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ కే హైలెట్ అని చెప్పాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ ఉదయ్ సహారన్ తో కలిసి సచిన్ ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. టీమిండియాని విజయతీరాలకు చేర్చారు. తృటిలో సెంచరీ చేజార్చుకున్న సచిన్ కు ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.  దీంతో అందరూ ఈ యువ ఆటగాడి గురించి తెగ ఆరా తీస్తున్నారు. 


తండ్రీ కల కోసం..


సచిన్ దాస్ మహారాష్ట్రలోని బీడ్‌లో జన్మించాడు. ఇతడికి చిన్నతనం నుంచే క్రికెట్ పై మక్కువ ఎక్కువ. సచిన్ తండ్రి సంజయ్ కూడా యూనివర్సీట్ స్థాయి వరకు క్రికెట్ ఆడాడు. ఇతడు దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్‌తో పాటు సచిన్ టెండూల్కర్ ఆరాదించేవాడు. దాంతో సచిన్ పేరు తన కుమారుడికి పెట్టాడు. కొడుకును క్రికెటర్ ను చేయాలని ఇతడు తెగ కష్టపడ్డాడు. కుమారుడు ప్రాక్టీస్ కోసం అప్పు చేసి మరీ టర్ఫ్ పిచ్ ను తయారు చేయించాడు. అందుకు తగినట్లుగానే సచిన్ దాస్ కూడా బాగా కష్టపడ్డాడు. 


Also Read: U19 World Cup: అండర్ 19 వరల్డ్ కప్ ను టీమిండియా ఎన్నిసార్లు గెలిచిందో తెలుసా?


మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో కొల్హాపుర్ టస్కర్స్ తరఫున అద్భుతంగా ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇతడు సిక్సర్లను అలవోకగా కొడతాడు. సచిన్ దాస్ తల్లి సురేఖ దాస్ మహారాష్ట్ర పోలీస్ శాఖలో అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా, తండ్రి సంజయ్ మహారాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు.  సచిన్ దాస్ సోదరి ప్రతీక్షా సివిల్స్ కు సిద్దమవుతోంది.  అండర్ 19 ప్రపంచకప్‌లో సచిన్ దాస్ ఇప్పటి వరకు 6 మ్యాచ్‌ల్లో 73.50 సగటుతో 294 రన్స్ చేశాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సచిన్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇతడి కంటే ముందు కెప్టెన్ ఉదయ్(389) ముషీర్ ఖాన్(338) ఉన్నారు.


Also Read: ICC Rankings: ఆ ఘనత సాధించిన తొలి ఆసియా క్రికెటర్లుగా కోహ్లీ, బుమ్రా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి