WI vs IND: చెలరేగిన సిరాజ్.. దూకుడుగా ఆడిన రోహిత్, ఇషాన్.. విజయం దిశగా టీమిండియా..
India vs West Indies: రెండో టెస్టులు టీమిండియా పట్టుబిగిస్తోంది. భారత్ గెలవాలంటే ఎనిమిది వికెట్లు తీయాలి. ప్రస్తుతం త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (16), బ్లాక్‌వుడ్ (20) క్రీజులో ఉన్నారు.
WI vs IND, 2nd Test, Day 4 Highlights: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో కరేబియన్ జట్టును 255 పరుగులకు ఆలౌట్ చేసి 183 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన భారత్ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో దూకుడైన ఆటతో రెండు వికెట్లు కోల్పోయి 181 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఆతిథ్య జట్టుకు 365 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన విండీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 289 పరుగులు చేయాలి. ప్రస్తుతం త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (16), బ్లాక్‌వుడ్ (20) క్రీజులో ఉన్నారు. బ్రాత్‌వైట్ (28; 52 బంతుల్లో 5 ఫోర్లు), కిర్క్ మెకంజీ (0)లను అశ్విన్ ఔట్ చేశాడు.
నాలుగో రోజు 229/5తో ఆట కొనసాగించిన ఆతిథ్య జట్టు కేవలం 7.4 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే చేసి చివరి 5 వికెట్లు కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ (5/60) ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. చివరి నాలుగు వికెట్లు అతడి తీయడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో రెండో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్లు ఇద్దరూ శుభారంభం ఇచ్చారు. ఓపెనర్‌లు రోహిత్ శర్మ (57; 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (38; 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి ఆడారు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (52; 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (29; 37 బంతుల్లో) కూడా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది. ఇషాన్ హాఫ్ సెంచరీ చేయగానే భారత్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
Also Read: IND A vs PAK A Asia Cup 2023: ఫైనల్లో యువ భారత్ చిత్తు.. ఛాంపియన్‌గా పాకిస్థాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook