Mumbai Indians PlayOffs: ఐపీఎల్ 2022లో ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన జట్టు..ఈసారి మాత్రం ఐదుసార్లు వరుసగా ఓడిపోయింది. పరాజయ యాత్ర కొనసాగిస్తున్న ఆ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలున్నాయా లేవా..ఇదే ఇప్పుడు హాట్ టాపిక్..ఆ అవకాలేంటో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఐపీఎల్ 2022 ఓ పీడకలగా మారుతోంది. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి పరాజయ యాత్ర కొనసాగిస్తోంది. ఇప్పటివరకూ ఆడిన 5 మ్యాచ్‌లు ఓడిపోయింది. పాయింట్ల స్థానంలో అట్టడుగున ఉండటమే కాకుండా..రన్‌రేట్ పరంగా కూడా మైనస్ 1.072తో ఉంది. ఒక్కొక్క మ్యాచ్ జరిగే కొద్దీ..ఇతర జట్లు విజయాలు అందుకునే కొద్దీ ముంబై ఇండియన్స్ జట్టు పరిస్థితి మరీ ఘోరంగా మారుతోంది. 


ఎవరెవరిపై ఓటమి


మార్చ్ 27వ తేదీన ఢిల్లీ కేపిటల్స్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. అనంతరం ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్ జట్టుపై పరాజయం చెందింది. ఏప్రిల్ 6వ తేదీన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా మూడవ ఓటమి. అనంతరం ఏప్రిల్ 9వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఓటమి పాలైంది. ఇక చివరిగా ఏప్రిల్ 13వ తేదీన పంజాబ్ కింగ్స్ చేతిలో 12 పరుగుల తేడాతో ఐదవ ఓటమి చవిచూసింది. 


ఇంకా ఎన్ని మ్యాచ్‌లు మిగిలాయి


ముంబై ఇండియన్స్ జట్టుకు ఐపీఎల్ 2022లో ఇంకా 9 మ్యాచ్‌లు మిగిలున్నాయి. అవి వరుసగా ఏప్రిల్ 16న లక్నో సూపర్ జెయింట్స్, ఏప్రిల్ 21న చెన్నై సూపర్‌కింగ్స్, ఏప్రిల్ 24న లక్నో సూపర్ జెయింట్స్, ఏప్రిల్ 30న రాజస్థాన్ రాయల్స్, మే 6న కోల్‌కతా నైట్‌రైడర్స్, మే 12న చెన్నై సూపర్‌కింగ్స్, మే 17న సన్‌రైజర్స్ హైదరాబాద్, మే 21న ఢిల్లీ కేపిటల్స్‌తో తలపడాల్సి ఉంది. 


ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్‌లు ఆ ఐదింటా ఓటమిపాలైన ముంబై ఇండియన్స్ జట్టు వరస్ట్ రన్‌రేట్ కలిగి ఉంది.  ముంబై తరువాత రన్‌రేట్ బాగాలేని జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పరంగా నాలుగు సాధించింది. 


ప్లే ఆఫ్‌కు చేరాలంటే ఎన్ని గెలవాలి


వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు కష్టంగా మారుతున్నాయి. ముంబై జట్టు ప్లే ఆఫ్‌కు చేరాలంటే మిగిలిన 9 మ్యాచ్‌లలో 7 మ్యాచ్‌లు తప్పనిసరిగా గెలిచి తీరాలి. అంటే 14 పాయింట్లు తప్పకుండా సాధించాల్సిన పరిస్థితి. 7 మ్యాచ్‌లు గెలిస్తేనే ముంబైకు ప్లేఆఫ్ చేరేందుకు అవకాశాలుంటాయి. ఒకేవేళ 8 మ్యాచ్‌లు గెలిచి 16 పాయింట్లు సాధిస్తే ఇతర జట్లతో పోటీలో ఉంటుంది. ఆరు మ్యాచ్‌లు గెలిచి..12 పాయింట్లు సాధిస్తే మాత్రం ప్లే ఆఫ్ అవకాశాలు పోయినట్టే. ఐపీఎల్ 2021 లో జరిగిందే మరోసారి పునరావృతం కానుంది. 


Also read: MI vs PBKS: ముంబైకు వరుసగా ఐదవ ఓటమి, 12 పరుగుల తేడాతో పంజాబ్ విజయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook