న్యూఢిల్లీ: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో భారత్, పాకిస్థాన్‌లు టెస్ట్ సిరీస్ ఆడటానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మరింత చొరవ చూపాలని, చురుకైన పాత్ర పోషించాలని పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ అన్నారు. రెండు దేశాలు ప్రభుత్వ స్థాయిలో పాకిస్తాన్, భారతదేశం చర్చించుకోవాలని ఆయన సూచించారు. ఈ సమస్య క్లిష్టమైనప్పటికీ ఈ ఛాంపియన్‌షిప్‌లో ఐసీసీ గట్టీ ప్రయత్నం చేయాలని వకార్ యూనిస్ క్రికెట్ బాజ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: గోవు మూత్రం ఒక లీటర్ ఎంతో తెలుసా?


ఛాంపియన్‌షిప్ నిబంధనల ప్రకారం, ప్రతి జట్టు ఎనిమిది జట్లలో ఆరు మాత్రమే ఆడవలసి ఉంటుందని, దాదాపు రెండు సంవత్సరాల పాటు జరిగే  ఈ టోర్నీ క్రీడాకారుల నైపుణ్యాన్ని తెలియజేస్తుందని అన్నారు. ఆగస్టు 1, 2019 న ప్రారంభమైన టెస్టు ఛాంపియన్ షిప్, జూన్ 10, 2021న ఫైనల్ మ్యాచ్ లార్డ్స్‌లో జరగనుంది. 


Read Also: కింగ్ కోబ్రానే మట్టికరిపించిన ముంగూస్ వీడియో వైరల్...


కాగా ఐసీసీ జోక్యం చేసుకొని ఏదో ఒకటి చేయాలని, ఒకవేళ అదే జరగకపోతే టెస్ట్ ఛాంపియన్‌షిప్ కు మ్యాచ్‌లకు అర్ధమే లేదని వకార్ యూనిస్ అన్నారు. 2007 నుండి ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్ జరగలేదని పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..