Nitu Ghanghas wins Gold Medal in WWBCH: ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో భారత్ కి బంగారు పంట పండించారు నీతూ ఘన్‌ఘాస్, సావిటి బూర. 48 కేజీల విభాగం ఫైనల్‌ మ్యాచ్‌లో మంగోలియాకు చెందిన లుత్‌సాయిఖాన్ అల్టాంట్‌సెగ్‌పై భారత్‌కి చెందిన బాక్సర్ నితు ఘన్‌ఘాస్ 5-0తో ప్రత్యర్థిని మట్టి కరిపించి భారత్ కి గోల్డ్ మెడల్ అందించింది. ఆ తరువాత 81 కేజీల విభాగం ఫైనల్ మ్యాచ్‌లో చైనాకు చెందిన వాంగ్ లీనాపై సావీటీ బూరా విజయం సాధించి మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో గోల్డ్ మెడల్ అందించింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


48 కేజీల విభాగంలో మంగోలియా పగిలిస్ట్ లుత్‌సాయిఖాన్‌తో నీతు ఘన్‌ఘాస్ పోరాటం వన్ సైడ్ వార్‌ని తలపించినప్పటికీ.. 81 కేజీల విభాగంలో సావీటీ బూర, వాంగ్ లీనాల మధ్య బాక్సింగ్ పోరు హోరాహోరీగా కొనసాగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో అంతిమంగా సావిటీ బూర స్వల్పంగా ఆదిక్య సాధించి 4-3 తేడాతో విజయం సాధించింది. చివరి వరకు విజయం ఇరువురి మధ్య దోబూచులాడినప్పటికీ.. బూర బాక్సింగ్ పంచ్ ముందు వాంగ్ లీనా తలవంచక తప్పలేదు. 



 


ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ చరిత్రలో గోల్డ్ మెడల్ గెలిచిన ఆరో భారతీయ మహిళగా నీతూ ఘన్‌ఘాస్ నిలవగా.. ఏడో స్థానంలో సావీటీ బూర నిలవడం విశేషం. మొత్తానికి ఈ టోర్నమెంట్‌లో రెండు వేర్వేరు కేటగిరీల్లో రెండు గోల్డ్ మెడల్స్ భారత్ వశమయ్యాయి.


ఇది కూడా చదవండి : MS Dhoni Record: ఐపీఎల్‌లో విన్నింగ్ సిక్స్ కొట్టడంలో నెం.1గా ఎంఎస్ ధోని..ఇది కదా కిక్కు!


ఇది కూడా చదవండి : IPL2023 New Rules: ఐపీఎల్ 2023లో మారిన కొత్త నిబంధనలేంటి, ఇంపాక్ట్ ప్లేయర్, టాస్ , డీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉంటుంది


ఇది కూడా చదవండి : Sanju Samson: భారత జట్టులోకి రావాలంటే.. సంజూ శాంసన్ ఇంకా ఏం చేయాలి! బీసీసీఐని ప్రశ్నించిన కాంగ్రెస్‌ ఎంపీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK