IPL 2023 New Rules: ఐపీఎల్ 2023లో కొత్త నిబంధనలు.. 11 మంది ప్లేయర్లు కాదండోయ్ ..12 మంది

IPL 2023 New Rules: క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఐపీఎల్ పండుగకు మరెన్నో రోజుల్లేవు. మార్చ్ 31న ఐపీఎల్ 2023 మొదటి మ్యాచ్ జరగనుంది. ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లలో గతంతో పోలిస్తే మూడు కీలకమైన మార్పులున్నాయి. ఇవి మ్యాచ్‌పై కచ్చితంగా ప్రభావం చూపనున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 31, 2023, 08:59 AM IST
IPL 2023 New Rules: ఐపీఎల్ 2023లో కొత్త నిబంధనలు.. 11 మంది ప్లేయర్లు కాదండోయ్ ..12 మంది

IPL 2023 New Rules: ఐపీఎల్ 2023 అహ్మదాబాద్ వేదికగా మార్చ్ 31న ఢిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఫోర్ టైమ్ విన్నర్ చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు మొదటి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ ఐపీఎల్ 16వ సీజన్‌లో కన్పించనున్న 3 కీలక మార్పులు మ్యాచ్‌పై ప్రభావం చూపించబోతున్నాయి. ఆ మూడు మార్పులేంటో చూద్దాం.

వాస్తవానికి ఇదేమీ కొత్త కాదు. ఐపీఎల్ 2023లో పాత విధానం మళ్లీ ప్రవేశపెడుతున్నారు. దీనినే హోమ్ అండే ఎవే ఫార్మట్ అంటారు. మొత్తం పది జట్లు 7 గేమ్స్‌ను తమ హోమ్ గ్రౌండ్‌లో ఆడాల్సి ఉంటుంది. ఉదాహరణకు చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు చిదంబరం స్టేడియంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చిన్నస్వామి స్టేడియంలో ఆడనున్నాయి.

కరోనా కంటే ముందు అంటే 2019లో ఐపీఎల్ దేశవ్యాప్తంగా జరిగింది. 2020, 2021, 2022లో సగం మాత్రమే ఇండియాలో జరిగాయి. 2022లో మాత్రం తొలిసారి ఐపీఎల్ టోర్నీ మొత్తం ఇండియాలో అది కూడా కేవలం మూడు నగరాలు పూణే, ముంబై, అహ్మదాబాద్‌లలో జరిగాయి. ఈసారి ఐపీఎల్‌లో కన్పించనున్న 3 కొత్త నిబంధనలు ఏంటనేది తెలుసుకుందాం..

టాస్ గెలిచిన తరువాత ప్లేయింగ్ 11 సమర్పించేటప్పుడు 5 మంది సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లకు ప్రతి జట్టుకు అనుమతి ఉంటుంది. ఈ ఐదుమందిలో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలో దిగేందుకు అవకాశముంటుంది. అయితే తప్పనిసరి నిబంధన కాదు. ఒకసారి ఇంపాక్ట్ ప్లేయర్‌తో బదిలీ అయిన తరువాత జట్టులోకి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా కూడా తిరిగి రాలేడు. మరోవైపు ప్లేయింగ్ 11లో విదేశీ ఆటగాళ్లు నలుగురి కంటే తక్కువే ఉంటే తప్ప ఇంపాక్ట్ ప్లేయర్ భారతీయుడు కాలేడనే నిబంధన ఉంది. 

ఐపీఎల్‌లో బీసీసీఐ మరో కీలక నిబంధన తీసుకొచ్చింది. టాస్ తరువాత రెండు జట్లు ప్లేయింగ్ 11 ప్రకటించవచ్చు. టాస్ ఆధారంగా బెస్ట్ జట్టుని ఆడించేందుకు ఈ కొత్త నిబంధన వీలు కల్పిస్తుంది. దక్షిణాఫ్రికా 20 లీగ్ సందర్భంగా ఆ జట్టు రెండు జట్లను ప్రతిపాదించింది. ముందు బౌలింగ్ ఉంటే ఓ జట్టును, బ్యాటింగ్ అయితే మరో జట్టుతో సిద్ధమైంది. అంటే ఈ కొత్త నిబంధన ఆయా జట్లపై టాస్ ప్రభావాన్ని చాలా వరకూ తగ్గిస్తుంది. 

ఇక ఈసారి ఐపీఎల్ 2023లో మరో మార్పు డీఆర్ఎస్. అంపైర్లు ఇచ్చే నో బాల్స్, వైడ్ బాల్స్ కూడా డీఆర్ఎస్ పరిధిలో రానున్నాయి. అంటే ఫీల్డ్ అంపైర్ ఇచ్చే నో బాల్ లేదా వైడ్ బాల్‌ని సైతం జట్టు కెప్టెన్ రివ్యూ చేసే అవకాశముంది. ఫలితంగా నో బాల్, వైడ్ బాల్ వివాదాలు తగ్గవచ్చు.

Also Read: Sanju Samson: భారత జట్టులోకి రావాలంటే.. సంజూ శాంసన్ ఇంకా ఏం చేయాలి! బీసీసీఐని ప్రశ్నించిన కాంగ్రెస్‌ ఎంపీ

Also Read: CSK Vs GT: నేను ఓపెనర్‌నే.. సీక్రెట్ బయటపెట్టిన అజింక్యా రహానే.. కానీ..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News