WPL Auction 2023: ముగిసిన డబ్ల్యూపీఎల్ 2023 వేలం.. ఇంకా ఏ ప్రాంచైజీ దగ్గర ఎంత ఉందంటే?
Remaining Purse Value of Five Teams after WPL Auction 2023. డబ్ల్యూపీఎల్ 2023 వేలం సోమవారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అట్టహాసంగా జరిగింది.
Remaining Purse Value of Five Teams after WPL Auction 2023: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2023 వేలం సోమవారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేలంలో ఐదు ప్రాంఛైజీలు టాప్ ప్లేయర్ల కోసం పోటీపడ్డాయి. పలువురు ఆటగాళ్లపై భారీగా కేటాయించి సొంతం చేసుకున్నాయి. దాంతో డబ్ల్యూపీఎల్ 2023 వేలంలో హిట్టర్లు, ఆల్‌రౌండర్లకు మంచి ధర పలికింది. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 3.40 కోట్లకు కొనుగోలు చేసింది.
డబ్ల్యూపీఎల్ 2023 వేలంలో ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డనర్‌ని గుజరాత్ జెయింట్స్ రూ. 3.20 కోట్లకు తీసుకుంది. అలానే ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ నాట్ స్కివర్‌ను ముంబై ఇండియన్స్ రూ. 3.20 కోట్లకు సొంతం చేసుకుంది. దీప్తి శర్మను యూపీ వారియర్స్ రూ. 2.60 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక జెమీమా రోడ్రిగ్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2.20 కోట్లకు జట్టులోకి తీసుకుంది.
ఐదు టీమ్స్ ఆటగాళ్ల కోసం 59.5 కోట్లు ఖర్చు పెట్టాయి. 5 జట్లు మొత్తంగా 87 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకున్నాయి. ఇందులో 30 మంది ఓవర్సీస్ క్రికెటర్లు ఉన్నారు. వేలం తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ. 35 లక్షల పర్స్ వాల్యూ ఉంది. గుజరాత్ జైంట్స్ వద్ద రూ. 5 లక్షలు ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.10 లక్షలు ఉన్నాయి. యూపీ వారియర్స్ మొత్తం ఖర్చు చేసింది.
అత్యధిక ధర పలికిన టాప్ 5 ప్లేయర్లు:
1. స్మృతి మంధాన (భారత్) - రూ.3.40 కోట్లు - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
2. అష్‌లీ గార్డ్‌నర్ (ఆస్ట్రేలియా) - రూ. 3.20 కోట్లు - గుజరాత్ జెయింట్స్
3. సీవర్ నటాలియె (ఇంగ్లండ్) - రూ. 3.20 కోట్లు - ముంబై ఇండియన్స్
4. దీప్తి శర్మ (భారత్) - రూ.2.60 కోట్లు - యూపీ వారియర్స్
5. జెమీమా రోడ్రిగ్స్ (భారత్) - రూ. 2.20 కోట్లు - ఢిల్లీ క్యాపిటల్స్
Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో సగం ధరకే ఐఫోన్.. ఈ సువర్ణావకాశం మళ్లీమళ్లీ రాదు! కొనడానికి ఎగబడుతున్న జనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.