Wriddhiman Saha says Iam not receive any apology from Journalist: ప్రస్తుతం భారత క్రికెట్‌లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా పేరు హాట్ టాపిక్ అయింది. మార్చి నెలలో స్వదేశంలో శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌ కోసం బీసీసీఐ భారత జట్టును ఎంపిక చేసిన అనంతరం దేశ వ్యాప్తంగా సాహా పేరు మార్మోగిపోయింది. తనను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సూచించాడంటూ మొదట పెద్ద బాంబ్ పేల్చిన సాహా.. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వనందుకు ఒక జర్నలిస్టు బెదిరించాడని మరో విషయం తెరమీదకు తెచ్చాడు.  ఇందుకు సంబందించిన వాట్సాప్ సంభాషణన స్క్రీన్‌ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనను బెదిరించిన జర్నలిస్ట్ పేరు చెప్పమని బీసీసీఐతో పాటు మాజీ క్రికెటర్లు కూడా వృద్ధిమాన్‌ సాహాను అడగ్గా.. అతడి పేరు బహిర్గతం చేయడం తనకు ఇష్టం లేదని చెప్పాడు. బుధవారం జీ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సాహా మాట్లాడుతూ... 'ఆ జర్నలిస్టు సందేశంతో నేనెంతో బాధపడ్డా. నేనెప్పుడూ ఏ జర్నలిస్టుతోనూ చెడుగా ప్రవర్తించలేదు. అయితే అలాంటి ప్రవర్తనను సహించొద్దనుకున్నా. అందుకే బెదిరింపు సందేశాలను మాత్రమే ప్రజల దృష్టికి తీసుకొచ్చా. జర్నలిజం ప్రపంచంలో అలాంటి వ్యక్తులు ఉన్నారని ప్రజలకు తెలిసేలా చేయాలనుకున్నా. అంతేకాని అతడి/ఆమె కెరీర్‌ను అంతం చేసే స్వభావం నాది కాదు. ఇలాంటివి పునరావృతమైతే అప్పుడు చెపుతా' అని అన్నాడు. 


'ఆ జర్నలిస్టుకు ఇది రెండో అవకాశం. సదరు జర్నలిస్ట్ నన్ను మరలా సంప్రదించలేదు. ఇప్పటికీ క్షమాపణలు కోరలేదు. ఈ విషయంపై ఇమెయిల్ మరియు ఫోన్ ద్వారా బీసీసీఐ నన్ను సంప్రదించింది. బీసీసీఐ దర్యాప్తు చేస్తోంది. అందుకు నేను సహకరిస్తాను. బీసీసీఐ అడిగినా ఆ జర్నలిస్టు పేరు బహిర్గతం చేయలేదు. ఎందుకంటే నాకు నైతిక విలువలు ఉన్నాయి. నేను ఎవరికైనా రెండవ అవకాశం ఇవ్వాలని ఎప్పుడూ భావిస్తాను. ప్రస్తుతానికి నేను ఆ జర్నలిస్టుకు రెండవ అవకాశం ఇవ్వాలనుకుంటున్నా' అని వృద్ధిమాన్‌ సాహా తెలిపాడు.



'రిటైర్మెంట్‌ గురించి ఆలోచించమని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ నేరుగా నాకు చెప్పలేదు. అయితే యువ ఆటగాళ్ల కోసం టీమ్ మేనేజ్మెంట్ ఎదురుచూస్తోందని మాత్రం చెప్పాడు. ప్రస్తుతం నేను రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదు. దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌తో పాటు ఇతర మ్యాచ్‌లు ఆడబోతున్నా. శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు తొలగించబడినందుకు నేను షాక్‌కి గురయ్యాను. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో నేను ఆడిన ఇనింగ్స్ కారణంగా కచ్చితంగా జట్టులో ఉంటానని ఊహించాను. అయితే సెలక్షన్ కమిటీ ఇప్ప నన్ను తప్పించాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు నాకు అర్ధమవుతోంది. సౌరవ్ గంగూలీ ఇంకా నన్ను సంప్రదించలేదు' అని సాహా చెప్పుకొచ్చాడు. 


Also Read; IND vs SL: టీమిండియాకు భారీ షాక్‌.. శ్రీలంకతో టీ20 సిరీస్ నుంచి ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఔట్‌!!


Also Read: RPF Constable Saves Life: రైలు కింద పడబోయిన మహిళను కాపాడిన కానిస్టేబుల్.. వీడియో పోస్ట్ చేసిన రేవంత్ రెడ్డి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook