WTC 2023-25 Points Table Update: రాంచీ టెస్టులో ఇంగ్లండ్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023-25 ​​పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. తాజా ఓటమితో ఇంగ్లండ్ స్థానం 19.44 శాతానికి పడిపోయి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ టీమ్ పాయింట్ పర్సెంటేజ్ 75గా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా స్థానం మరింత పదిలం..
ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో టీమిండియా 8 టెస్టుల్లో ఐదింటిని గెలిచింది. దీంతో భారత్  పాయింట్స్ పర్సెంటేజ్ 64.58 శాతానికి ఎగబాకింది. దీంతో రెండో స్థానంలో ఉన్న రోహిత్ సేన మరింత బలపడింది. స్వదేశంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ ను 3-తో కైవసం చేసుకున్న టీమిండియా.. మరో టెస్టు గెలిస్తే టాప్ లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ రేసులో 9 టెస్టుల ఆడిన ఇంగ్లండ్ టీమ్ ఐదు ఓడిపోయి ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఆస్ట్రేలియా జట్టు 10 మ్యాచ్ లలో 6 గెలిచి 55 పర్సెంటేజ్ తో మూడో స్థానంలో ఉంది.ఆసీస్ తర్వాత స్థానాల్లో వరుసగా బంగ్లాదేశ్, పాకిస్థాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, శ్రీలంక ఉన్నాయి. 


భారత్ ఘన విజయం 
రాంచీ వేదికగా ఇంగ్లండ్ జరిగిన నాలుగో టెస్టులో అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించిన టీమిండియా హ్యాట్రిక్ విజ‌యంతో సిరీస్ కైవ‌సం చేసుకుంది. ఇంగ్లండ్ యువ స్పిన్న‌ర్లు టామ్ హ‌ర్ట్లే, షోయ‌బ్ బ‌షీర్‌లు రోహిత్ సేనను ఇబ్బంది పెట్టినా.. యువ ఆటగాళ్లు శుభ్‌మ‌న్ గిల్‌(52 నాటౌట్), ధ్రువ్ జురెల్‌(39 నాటౌట్) స‌మ‌యోచిత బ్యాటింగ్‌తో రోహిత్ సేన‌ 5 వికెట్ల తేడాతో స్టోక్స్ సేన పై గెలుపొందింది. 


Also Read: IND vs ENG Highlights: ఇంగ్లాండ్‌ను మడతబెట్టిన భారత్.. నాలుగో టెస్టులో సూపర్ విక్టరీ.. సిరీస్‌ మనదే..!


Also Read: IND vs ENG 4th Test: గెలుపు వాకిట తడబడుతున్న రోహిత్ సేన.. ఆశలన్నీ గిల్ పైనే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook