IND vs ENG 4th Test Live Score: రాంచీ టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే గెలుపు ముందుట కాస్త తడబడుతోంది. ఓవర్ నైట్ స్కోర్ 40తో నాలుగో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. రూట్ తన తొలి ఓవర్‌లోనే యశస్వీ జైస్వాల్(37 :44 బంతుల్లో)ని ఔట్ చేసి ఇంగ్లండ్ కు బ్రేక్ ఇచ్చాడు. దాంతో రోహిత్ సేన 84 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన గిల్ రోహిత్ తో కలిసి ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో రోహిత్(55 : 81 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హిట్ మ్యాన్ కు ఇది టెస్టుల్లో 17వ హాఫ్ సెంచరీ. అయితే కాసేపటికే టామ్ హర్ట్లే బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రజత్ పాటిదార్ మరోసారి విఫలమయ్యాడు. బషీర్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా వంద పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజాతో కలిసి గిల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నాడు. రోహిత్ సేన 118/3తో లంచ్ కు వెళ్లింది. అయితే లంచ్ నుంచి వచ్చిన వెంటనే టీమిండియా జడేజా వికెట్ ను కోల్పోయింది. బషీర్ బౌలింగ్ లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు జడ్డూ. తర్వాత ఓవర్లో సర్పరాజ్ కూడా ఔటయ్యాడు. దీంతో రోహిత్ సేన కష్టాల్లో పడింది. ప్రస్తుతానికి టీమిండియా 38.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. గిల్, ధ్రువ్ ఆడుతున్నారు. మరి ఈ మ్యాచ్ లో రోహిత్ సేన గెలుస్తాందా లేదా ఇంగ్లండ్ స్పిన్ కు దాసోహమవుతుందో లేదో చూడాలి.
Also Read: Ind vs Eng: ఇంగ్లండ్ తో టెస్ట్ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ 3 కొత్త రికార్డులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter