భారత్ వేదికగా ప్రస్తుతం ఐపీఎల్ 2023 రసవత్తరంగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని జట్లు ప్రయత్నిస్తున్నాయి. ఐపీఎల్ 2023లో భాగంగా నేడు 18వ మ్యాచ్ పంజాబ్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఇక మే 28న ఐపీఎల్ 16వ సీజన్ ముగుస్తుంది. అనంతరం భారత్ జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇంగ్లండ్‌లోని లండన్‌ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ జూన్‌ 7 నుంచి జరగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కోల్పోయిన టీమిండియా వెటరన్‌ ప్లేయర్ అజింక్య రహానేకు బంఫర్ ఆఫర్ తగిలే అవకాశం ఉంది. గాయం కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైన స్టార్ ప్లేయర్ శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో రహానే జట్టులోకి రానున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఐపీఎల్‌ 2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్న జింక్స్.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగులు చేశాడు. ఈ ఒక్క మ్యాచుతో తానేంటో నిరూపించుకున్నాడు. రాజస్తాన్‌పై  31 పరుగులు బాదాడు. దాంతో రహానేను మళ్లీ టెస్ట్ జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ సెలక్టర్లు భావిస్తున్నారని తెలుస్తోంది. 


శ్రేయాస్ అయ్యర్‌ స్థానంలో మిస్టర్ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేస్తారని ఇదివరకు వార్తలు వచ్చాయి. అయితే సూర్యప్రస్తుత ఫామ్‌ బాగాలేదు. అదే సమయంలో అజింక్య రహానే దుమురేపుతున్నాడు. ఐపీఎల్ ముందు జరిగిన రంజీ ట్రోఫీలో రహానే 7 మ్యాచ్‌లు ఆడి 57.63 సగటుతో 634 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఓ డబుల్ సెంచరీ ఉన్నాయి. ఐపీఎల్ 2023లో కూడా జింక్స్ పరుగులు చేస్తుండడంతో.. బీసీసీఐ సెలక్టర్లు తమ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు విదేశీ పిచ్‌లపై రహానేకు మంచి అనుభవం ఉండడం కూడా అతడికి కలిసిరానుంది. 


అజింక్య రహానే చివరగా భారత్‌ తరఫున 2022 ఆరంభంలో దక్షిణాఫ్రికాపై ఆడాడు. ఆపై శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టెస్టు జట్టులో బీసీసీఐ రహానేని జట్టులో చేర్చలేదు. అంతకుముందు 2-3 సిరీస్‌లలో వరుసగా విఫలమవడంతో బీసీసీఐ సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టారు. రహానే భారత్ తరఫున 82 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. జింక్స్ టెస్టుల్లో 12 సెంచరీలు, వన్డేలలో 3 శతకాలు బాదాడు. 


Also Read: 2023 iPhone 15 Pro: ఐఫోన్ 15 ప్రో కొనుగోలు చేసే వారికి బ్యాడ్ న్యూస్.. తప్పక తెలుసుకోవాల్సిన విషయం!  


Also Read: PBKS vs GT: టాస్‌ గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌.. రెండు మార్పులతో బరిలోకి పంజాబ్ కింగ్స్!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.