2023 iPhone 15 Pro: ఐఫోన్ 15 ప్రో కొనుగోలు చేసే వారికి బ్యాడ్ న్యూస్.. తప్పక తెలుసుకోవాల్సిన విషయం!

Apple iPhone 15 Pro models have solid state buttons. ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ సంస్థ 'ఐఫోన్ 15' సిరీస్‌ను విడుదల చేయనుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 13, 2023, 07:20 PM IST
2023 iPhone 15 Pro: ఐఫోన్ 15 ప్రో కొనుగోలు చేసే వారికి బ్యాడ్ న్యూస్.. తప్పక తెలుసుకోవాల్సిన విషయం!

Apple iPhone 15 Pro models have solid state buttons: ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ సంస్థ 'ఐఫోన్ 15' సిరీస్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్ లాంచింగ్‌కి ఇంకా కొంత సమయం మాత్రమే ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఐఫోన్ 15 సిరీస్‌కు సంబందించిన లీకులు, రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్ డిజైన్, ధర గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. యాపిల్ యొక్క ఐఫోన్ 15 ప్రో మోడల్‌లు సాలిడ్-స్టేట్ బటన్‌లకు బదులుగా భౌతిక బటన్‌లను కలిగి ఉండవచ్చవని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. 

యాపిల్ విశ్లేషకుడు మింగ్ చి-కువో ప్రకారం.. ఐఫోన్ 15 సిరీస్‌ ఉత్పత్తికి ముందు పరిష్కరించని సాంకేతిక సమస్యల కారణంగా ఐఫోన్ 15 ప్రో మోడల్ సాంప్రదాయ భౌతిక బటన్ డిజైన్‌ను కలిగి ఉంటుందట. ఉత్పత్తికి ముందు పరిష్కరించని సాంకేతిక సమస్యల కారణంగా.. హై-ఎండ్ ఐఫోన్ 15 ప్రో మోడల్స్ (ప్రో మరియు ప్రో మాక్స్) రెండూ నిశితంగా పరిశీలించబడతాయని మింగ్ చి-కువో తెలిపారు. పై విధంగా బుధవారం ఓ పోస్ట్‌లో పేర్కొన్నారు.

సాలిడ్-స్టేట్ బటన్‌ల (వాల్యూమ్ బటన్, పవర్ బటన్) కోసం టాక్టిక్ ఇంజన్ సరఫరాదారు అయిన Luxshare ICT, AAC టెక్నాలజీస్ కంటే చాలా పెద్ద ఆపరేటింగ్ స్కేల్ కారణంగా తక్కువ ప్రభావం చూపుతుంది. ఐఫోన్ 15 ప్రో ఇప్పటికీ EVT డెవలప్‌మెంట్ దశలోనే ఉందని, కాబట్టి డిజైన్‌ను సవరించడానికి ఇంకా సమయం ఉందని మింగ్ చి-కువో చెప్పారు.

Also Read: Samsung Galaxy M14 5G Launch: శాంసంగ్‌ నుంచి చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌.. పూర్తి ఛార్జ్‌పై 2 రోజుల బ్యాటరీ! డిజైన్, ఫీచర్స్ సూపర్  

అదనంగా సాలిడ్-స్టేట్ బటన్‌లను తీసివేయడం, భౌతిక బటన్‌ల పునఃస్థాపన అభివృద్ధి మరియు పరీక్ష ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఈ పరిశీలనల ఆధారంగా సాలిడ్-స్టేట్ బటన్‌ని తీసివేయడం ఐఫోన్ 15 ప్రో మోడల్ యొక్క భారీ ఉత్పత్తి మరియు షిప్‌మెంట్‌లపై స్వల్ప ప్రభావాన్ని చూపుతుంది.

Also Read: Lovers Viral Video: ఈ వయసులో ఇంత కామం ఏంటి ఆంకుల్‌.. మరీ 18 ఏళ్ల యువతితో ఎలా రొమాన్స్‌ చేశాడో మీరే చూడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News