సిడ్నీ: యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) మెరుపు ఇన్నింగ్స్, కళ్లు చెదిరే షాట్స్ మళ్లీ చూడొచ్చా అంటే క్రికెట్ ఆస్ట్రేలియా అధికార వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఎందుకంటే ఆస్ట్రేలియా టీ20 లీగ్‌ బిగ్‌బాష్‌ లీగ్‌ (BBL)లోకి యూవీని తీసుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా శత విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ సీఏ ప్లాన్స్ వర్కౌట్ అయి యూవీని తీసుకున్నట్టయితే.. బీబీఎల్‌లో ( Big Bash League ) ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ పేరు బీబీఎల్ రికార్డ్సులోకి ఎక్కనుంది. Also read : Rhea Chakraborty's bail plea: రియా చక్రవర్తికి షాక్ ఇచ్చిన కోర్టు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BBL లో ఆడేందుకు యువరాజ్ సింగ్ సైతం ఆసక్తి చూపిస్తున్నాడని.. మరోవైపు యువీ కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా ( Cricket Australia ) కూడా బిబిఎల్ ఫ్రాంఛైజీలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. యువి లాంటి ఆటగాళ్లు బీబీఎల్‌లో పాల్గొంటే.. లీగ్‌ పట్ల ఉన్న క్రేజ్ మరింత పెరుగుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. అందులో భాగంగానే ఇలా యువి కోసం సీఏ తన వంతు ప్రయత్నాలు తాను చేస్తోంది. Also read : Gutta Jwala engagement: సినీనటుడితో గుత్తా జ్వాల పెళ్లి


బీసీసీఐ నిబంధనల ( BCCI rules ) ప్రకారం విదేశీ లీగుల్లో ఆడేందుకు అంతర్జాతీయ లేదా దేశీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ఆటగాళ్లకు మాత్రమే బీసీసీఐ నుంచి అనుమతి ఉంటుంది. గతేడాది జూన్‌లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన యువీ గతంలో బీసీసీఐ నుంచి అనుమతి ( NOC ) తీసుకొని కెనడా టీ20 లీగ్‌, టీ10 వంటి టోర్నీల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. Also read : Director Surya Kiran: బిగ్ బాస్ కంటెస్టెంట్ సూర్యకిరణ్‌ ఎవరో తెలుసా ?


మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR