Shikhar Dhawan: మళ్లీ మరిచిపోయావా అంటూ యువరాజ్ సింగ్ ట్రోలింగ్
Shikhar Dhawan Trolled for not asking DRS | ఫైనల్స్‌కు చేరాలంటే నెగ్గాల్సిన కీలకమైన మ్యాచ్‌లో ధావన్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 78 పరుగులతో రాణించి ఢిల్లీ జట్టును ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఫైనల్స్‌కు చేర్చాడు. ధావన్ ఔట్ కావడంతో మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి ఆ బంతి స్టంప్స్‌నకు చాలా దూరంగా వెళ్తున్నట్లు రీప్లేలో కనిపించింది.
తప్పనిసరిగా నెగ్గాల్సిన ఐపీఎల్ 2020 (IPL 2020) క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)పై ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. సీజన్‌లో రెండు వరుస శతకాలు చేసి ఫామ్‌లోకొచ్చిన ఢిల్లీ (Delhi Capitals) ఓపెనర్ శిఖర్ ధావన్ ఆపై గతి తప్పాడు. వరుస మ్యాచ్‌లలో డకౌట్స్ అయ్యాడు. ఫైనల్స్‌కు చేరాలంటే నెగ్గాల్సిన కీలకమైన మ్యాచ్‌లో ధావన్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 78 పరుగులతో రాణించి ఢిల్లీ జట్టును ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఫైనల్స్‌కు చేర్చాడు శిఖర్ ధావన్.
అయితే ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ధావన్ ఎల్బీడబ్ల్యూగా నిష్క్రమించాడు. ధావన్ ఔట్ కావడంతో మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే 18.3వ ఓవర్ సందీప్ శర్మ వేసిన బంతిని ఢిల్లీ ఆటగాడు శిఖర్ ధావన్ ఆడేందుకు యత్నించగా ప్యాడ్స్‌ను తాకడంతో బౌలర్ అప్పీల్ చేశాడు. ఔట్ అయ్యాననుకుని అంపైర్ నిర్ణయానికి ముందే క్రీజును వదిలాడు గబ్బర్. ఇది చూసిన యువరాజ్ సింగ్ సహా పలువురు తాజా, మాజీ క్రికెటర్లు ధావన్‌పై ఫన్నీగా స్పందిస్తున్నారు. మళ్లీ ఎలా మరిచిపోయావ్ బ్రో అని యువీ ట్వీట్ చేశాడు. సన్‌రైజర్స్ బౌలర్లను మెచ్చుకున్నాడు.
‘గబ్బర్’ ధావన్ మరోసారి డీఆర్ఎస్ మరిచిపోయాడని కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి ఆ బంతి స్టంప్స్‌నకు చాలా దూరంగా వెళ్తున్నట్లు రీప్లేలో కనిపించింది. అయితే ధావన్ పదే పదే రివ్యూ కోరడం మరిచిపోతాడని మరోసారి నిరూపించుకున్నాడు. ఢిల్లీ జట్టు గెలవడంతో ఈ విషయం అంతగా చర్చనీయాంశం కాలేదు. లేకపోతే ధావన్ చేసిన తప్పిదానికి జట్టు మూల్యం చెల్లించుకుంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అందరికీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. నవంబర్ 10న ఐపీఎల్ 2020 ఫైనల్లో ముంబై ఇండియన్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఢీకొట్టనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe