Airtel Best Recharge Plan: ప్రీ పెయిడ్ కస్టమర్లకు అంతా బాగానే ఉన్నా ఓ చికాకు ఎప్పటికీ ఉంటుంది. కొన్ని ప్లాన్స్ 28 రోజులు, కొన్ని 30 రోజులు, మరికొన్ని 54 లేదా 84 రోజులు ఇలా ఉంటుంటాయి. గుర్తు పెట్టుకుని మరీ సకాలంలో రీఛార్జ్ చేయించుకోవల్సి వస్తుంటుంది. ఇప్పుడిక ఈ సమస్య ఉండదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి నెలా రీఛార్జ్ చేయించుకుంటూ విసిగిపోతుంటే చక్కని పరిష్కారం ఉంది. ప్రముఖ టెలీకం కంపెనీ ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్ అందిస్తోంది. ఎయిర్‌టెల్ కస్టమర్ అయుండి..నెల నెలా రీఛార్జ్ బాధపడకుండా ఉండాలంటే మంచి అవకాశం ఎయిర్‌టెల్ కల్పిస్తోంది. ఈ ప్లాన్ నిజంగానే అద్భుతమైన ప్లాన్ కానుంది. ప్రతి నెలా రీఛార్జ్ చేయించుకోవల్సిన అవసరం లేదు. ఇక ఎయిర్‌టెల్ ఏడాది ప్లాన్ ప్రారంభించింది. ఈ ప్లాన్ కాల పరిమితి 365 రోజులుంటుంది. ఈ ప్లాన్ తీసుకుంటే నెలనెలా రీఛార్జ్ బెడద తప్పడమే కాకుండా చాలా లాభాలున్నాయి. ఎయిర్‌టెల్ 365 డేస్ రీఛార్జ్ ప్లాన్ తీసుకుంటే నెల నెలా చేయించుకునే రీఛార్జ్ కంటే తక్కువ ఖర్చవుతుంది.


ఎయిర్ టెల్ 365 డేస్ రీఛార్జ్ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా అందుతుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. ఎయిర్‌టెల్ అధికారిక యాప్ ద్వారా రీఛార్జ్ చేస్తే 100 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ప్లాన్ ఖరీదు 2023 రూపాయలు. ఏడాది పాటు వర్తిస్తుంది. పూర్తిగా ఏడాది ఏ విధమైన రీఛార్జ్ చేయించాల్సిన అవసరముండదు. నెల నెలా లేదా 54 రోజులు లేదా 84 రోజుల ప్లాన్స్‌తో పోల్చుకుంటే ఏడాది 365 డేస్ ప్లాన్ చౌకగా ఉంటుంది.


Also read: Hyundai Exter SUV Launch: అద్భుతమైన లుక్స్, ఫీచర్లతో హ్యుండయ్ Exter SUV, బుకింగ్స్ ప్రారంభం, ధర ఎంతంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook