Hyundai Exter SUV Launch: ఇటీవలి కాలంలో ఎస్‌యూవీ లేదా మిడ్ సెగ్మెంట్ ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతోంది. ఎత్తు ఉండటం, డ్రైవింగ్ కంఫోర్ట్, లెగ్ స్పేస్ ఇలా ఎస్‌యూవీలు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అందుకే ఎస్‌యూవీ మార్కెట్ అందర్నీ ఆకర్షిస్తోంది.
హ్యుండయ్ సరికొత్త మిడ్ సెగ్మెంట్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఈ ఎస్‌యూవీ పేరు Exter.ఇటీవలే ఇండియాలో ప్రవేశపెట్టిన హ్యుండయ్ Exter మిడ్ సెగ్మెంట్ ఎస్‌యూవీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఒకసారి మార్కెట్‌లో ప్రవేశించాక కచ్చితంగా టాటా పంచ్, సిట్రోయెన్ సి3తో పోటీ పడనుందని తెలుస్తోంది. టాటా పంచ్, సిట్రెయెన్ సి3లు మిడ్ సెగ్మెంట్ ఎస్‌యూవీల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందాయి. కేవలం 11 వేల రూపాయలతో ఈ ఎస్‌యూవీ బుక్ చేసుకోవచ్చు. మరి కొద్దినెలల్లో ఇది లాంచ్ కానుంది.
ఈ ఎస్‌యూవీ ఫీచర్లు, ప్రత్యేకతల్ని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఈ కారు ఐదు వేరియంట్లలో వస్తోంది. హ్యుండయ్ Exter 1.2 లీటర్ VTVT NA పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ప్రస్తుతం ఈ ఇంజన్ హ్యుండయ్ కంపెనీకు చెందిన వెన్యూ, ఐ20, ఐ10 నియోస్, ఔరాలో ఉన్నదే. ఈ కారు ఇంజన్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ ఇంజన్ 82 బీహెచ్‌పి పవర్, 115 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ ట్రాన్స్ మిషన్ ఉంటుంది.
హ్యుండయ్ Exter వేరియంట్, ప్రత్యేకతలు
హ్యుండయ్ Exter ఐదు వేరియంట్లు EX, S, SX, SX(O),spec SX(O)లతో వస్తోంది. ఇందులో ఇంకా కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్లు ఉంటాయని కంపెనీ చెబుతోంది. ఈ సెగ్మెంట్‌లో తొలి సన్‌రూఫ్, 8 ఇంచెస్ ఫ్లోటింగ్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సెమీ డిజిటల్ క్లస్టర్, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి.
హ్యుండయ్ Exter కారు జూలై-ఆగస్టు నెలల్లో లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ కారు ధర వివరాలు కూడా అప్పుడే వెల్లడి కానున్నాయి. ఒకసారి ఈ కారు మార్కెట్‌లో విడుదలయితే ఇప్పటికే భారతీయ మార్కెట్‌లో ఉన్న టాటా పంచ్, సిట్రోయెన్ సి3లకు పోటీ పడనుంది.
Also read: 2023 Cheapest Car in india: 5 లక్షల బడ్జెట్‌లో 4 బెస్ట్ కార్లు.. మైలేజ్ 32 కిలోమీటర్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook