Prime subscription Price: ఇండియన్ ఓటీటీ మార్కెట్‌ లో మెజార్టీ వాటాను కలిగి ఉన్న అమెజాన్ ప్రైమ్‌ మరోసారి తమ ఖాతాదారులకు షాక్‌ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. అత్యధిక ధరలు వసూళ్లు చేస్తున్న ఓటీటీ ల జాబితాలో ముందు ఉన్న అమెజాన్ ప్రైమ్‌ ఇప్పుడు మరోసారి తమ సబ్‌ స్క్రిప్షన్‌ ధరలను పెంచేందుకు గాను సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. నెలవారి సబ్ స్క్రిప్షన్‌ ధరను ఏకంగా 67 శాతం పెంచడం జరిగింది. సాధారణంగా అమెజాన్ ప్రైమ్‌ ను ఎక్కువ శాతం మంది నెల వారి సబ్‌ స్క్రిప్షన్ ను వినియోగిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇది పెద్ద షాక్ గా చెప్పుకోవచ్చు. ఇక త్రైమాసిక ప్లాన్‌ ధరలో కూడా మార్పు చేయడం జరిగింది. కానీ వార్షిక ప్లాన్ లో మాత్రం మార్పు చేయక పోవడం విశేషం. ఇప్పటికే కొత్త ధరలు అమలులోకి వచ్చినట్లుగా అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాత సబ్ స్క్రైబర్స్‌ కి 2024 జనవరి 15 వరకు పాత రేట్లు వర్తిస్తాయి. వారు రెన్యువల్‌ మిస్ చేసుకోకుండా చేసుకుంటూ ఉంటే పాత రేట్లు వర్తిస్తాయి. ఒక వేళ రెన్యువల్‌ ఒక్క రోజు ఆలస్యం అయినా కూడా వారు కూడా కొత్త ధరలతో సబ్‌ స్క్రిప్షన్ ను తీసుకోవాల్సి ఉంటుందని అమెజాన్‌ పేర్కొంది. కొత్తగా అమెజాన్ ప్రైమ్‌ ను తీసుకోవాలి అనుకున్న వారు మాత్రం పెద్ద మొత్తంలో సబ్‌ స్క్రిప్షన్ కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. వార్షిక ప్లాన్‌ తీసుకుంటే అందరికి ఒకే రేటు కానీ నెల వారి లేదా మూడు నెలల ప్లాన్‌ విషయంలోనే చాలా తేడా ఉంది. అందుకే ఇక నుండి ఎవరైనా కూడా వార్షిక ప్లాన్‌ ను తీసుకునే విధంగా అమెజాన్ ప్లాన్‌ చేసిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీదట వార్షిక ప్లాన్‌ తీసుకునే వారు ఎక్కువగా ఉంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 


అమెజాన్ ప్రైమ్‌ నెలవారీ చందా పాత ధర రూ.179 ఉండేది. ఈ మొత్తంను రూ.299 కి పెంచడం జరిగింది. ఇక మూడు నెలలకు గాను పాత ధర 459 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఆ మొత్తంను రూ.599 గా చేయడం జరిగింది. అయితే ఏడాది చందా మొత్తం గతంలో ఎంత అయితే ఉండేదో ఇప్పుడు కూడా అంతే ఉంది. వార్షిక చందాను రూ.1499 గా అమెజాన్ ప్రైమ్‌ కొనసాగిస్తున్నట్లుగా అధికారిక పోర్టల్‌ లో పేర్కొన్నారు. అమెజాన్ లైట్‌ వార్షిక సబ్‌ స్క్రిప్షన్‌ ను రూ.999 కి లభిస్తున్న విషయం తెల్సిందే. ప్రైమ్‌ వినియోగదారులకు ఉండే ప్రయోజనాలు ఉంటాయి కానీ వీడియో కంటెంట్‌ ను హెచ్‌డీ క్వాలిటీ లో చూసే అవకాశం ఉండదు. అంతే కాకుండా ఈ ప్లాన్ లో ఇబ్బడి ముబ్బడిగా ప్రకటనలు వస్తూనే ఉంటాయి. 


Also Read: Bandi Sanjay's Bail: బండి సంజయ్ బెయిల్ రద్దుపై పోలీసులకు షాకిచ్చిన కోర్టు


ఇండియాలో ఓటీటీ ప్రేక్షకులు పెరుగుతున్న నేపథ్యంలో అమెజాన్ పెద్ద ఎత్తున వెబ్‌ సిరీస్ లను అందించడంతో పాటు పెద్ద ఎత్తున కొత్త సినిమాలను భారీ చిత్రాలను కొనుగోలు చేస్తోంది. దాంతో చాలా మంది ప్రైమ్ సబ్‌ స్క్రిప్షన్ ను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇండియాలో అత్యధికులు ఖాతాదారులు ఉన్న ఓటీటీ గా అమెజాన్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. అలాంటి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి రేట్ల పెంపు నిర్ణయం తీసుకోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


Also Read: Rinku Singh-Virat Kohli: కింగ్ కోహ్లీ కాళ్లు మొక్కిన రింకూ సింగ్.. ఫోటోలు వైరల్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.