Android New Features: నెక్ట్స్ ఆండ్రాయిడ్ అప్డెట్‌లో వచ్చే ఫీచర్స్ ఇవే..Ok Google ఫీచర్ కూడా..
Android New Features September 2023: త్వరలోనే ఆండ్రాయిడ్ అప్డెట్‌లో భాగంగా మీ స్మార్ట్ ఫోన్లో మరి కొన్ని ఫీచర్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే గూగుల్ వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా అందించింది. అయితే వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Android New Features September 2023: యాపిల్ ఐఫోన్స్ మినహా ప్రతి స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్‌పై పని చేస్తుంది. అయితే గూగుల్ దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం మొబైల్ ఫోన్స్‌కి కొత్త కొత్త ఆండ్రాయిడ్ అప్డెట్స్‌ను అందిస్తోంది. భవిష్యత్ తరాల కోసం ఆండ్రాయిడ్ మరో ముందు అడుగు వేసింది. రాబోతున్న ఆధునిక జీవనశైలిని దృష్టిలో పెట్టుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి మరోన్నే కొత్త ఫీచర్స్‌ను నెక్ట్స్ ఆండ్రాయిడ్ అప్డెట్‌లో పరిచయం చేయబోతోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ వాతావరణ హెచ్చరికలు, డైనమిక్ ట్రావెల్ అప్‌డేట్‌లు, రాబోయే ఈవెంట్ రిమైండర్‌లు వంటి ఫీచర్స్‌కి సంబంధించిన వివరాలను అందించింది. అయితే త్వరలోనే రాబోయే ఆండ్రాయిడ్ అప్డెట్‌లోని మరిన్ని ఫీచర్స్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఫోటోను వివరించే ఫీచర్:
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ ఫీచర్స్ విషయానికొస్తే గూగుల్ కేవలం మనం రాసిన టెక్ట్స్, లేదా ఎదైన వెబ్ సైట్‌లో ఉండే టెక్ట్స్‌ను రీడ్ లౌడ్ అనే ఫీచర్ ద్వారా చదివి వినిపించేంది. కానీ Google త్వరలోనే అందించబోయే ఆండ్రాయిడ్ అప్డెట్‌లో భాగంగా లుకౌట్ AI ఫీచర్‌ను తీసుకు రాబోతోంది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఫోటోలకు సంబంధించిన స్థితి, ఇతర వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. దీనినే లుక్‌అవుట్ పేరుతో ఆండ్రాయిడ్ అప్డెట్‌లో భాగంగా కొరియన్, చైనీస్‌తో సహా 11 భాషల్లో అందించబోతోంది.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
Android Auto కమ్యూనికేషన్ యాప్‌లు:
ఆండ్రాయిడ్ ఆటో పేరుతో మరి కొన్ని యాప్‌లను తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా Zoom లాంటి ఆడియో, వీడియో కాన్ఫరెన్స్ కాల్‌లకి సంబంధించిన యాప్‌లను తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కారు డిస్‌ప్లేలో మీటింగ్ షెడ్యూల్ చెక్ చేసుకునే విధంగా కూడా కొత్త ఫీచర్స్‌ను తీసుకు రాబోతోంది.
Ok Google:
Ok Google అనగానే అందరీకి అమెజాన్ అలెక్సా గుర్తుకు వస్తుంది. అయితే దీని తరహాలోనే గూగుల్ కూడా మరో ఫీచర్స్‌తో మీ ముందుకు రాబోతోంది. వ్యక్తిగత దినచర్యలలో వ్యాయామాలు, స్లీపింగ్ హవర్స్ వంటి ఫీచర్స్‌ను Ok Googleలో తీసుకు రాబోతోంది. ఈ ఫీచర్‌లో భాగంగా మీరు "Ok Google, గుడ్ మార్నింగ్" అని చెబితే..ఒకే గూగుల్ మీరు రాత్ర ఎంత సేపు పడుకున్నారో కూడా తెలియజేస్తుంది. దీంతో పాటు నెక్ట్స్ ఆండ్రాయిడ్ అప్డెట్‌లో మరెన్నో ఫీచర్స్ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి