Purchage Apple iPhone 14 just Rs 34000 in Unicorn: ప్రపంచ దేశాలతో సహా భారతదేశంలో కూడా 'యాపిల్ ఐఫోన్‌'కు మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం యువతతో పాటు పెద్ద వయసు వారు కూడా తమ చేతిలో ఐఫోన్ ఉండాలని కోరుకుంటున్నారు. అయితే మిగతా స్మార్ట్‌ఫోన్‌ల కంటే.. ఐఫోన్ ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో సామాన్య ప్రజలు కొనలేకపోతున్నారు. బడ్జెట్ తక్కువగా ఉండి.. ఐఫోన్ కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. ఐఫోన్‌ 14 (iPhone 14) లేదా ఐఫోన్‌ 14 ప్లస్ (iPhone 14 Plus)ని Apple యొక్క అధీకృత యునికార్న్‌ (Unicorn)లో చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

iPhone 14 Price:
ఐఫోన్‌ 14 సెప్టెంబర్ 2022లో విడుదలైంది. 128 GB వేరియెంట్ అసలు ధర రూ. 79,900. కానీ మీరు యునికార్న్‌ స్టోర్ అందించే అన్ని డిస్కౌంట్‌లకు అర్హత కలిగి ఉంటే.. మీరు ప్రీమియం ఫోన్‌ను రూ. 34,000 కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. స్టోర్ అందించే డిస్కౌంట్‌లను ఓసారి చూద్దాం. యునికార్న్ స్టోర్ ప్రస్తుతం రూ. 10,000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. దాంతో ఈ ఐఫోన్‌ ధర రూ. 69,000కి తగ్గుతుంది. 


iPhone 14 Exchange Offer:
యునికార్న్ స్టోర్ కాకుండా.. HDFC బ్యాంక్ ఐఫోన్‌ 14పై రూ.  4,000 తగ్గింపును అందిస్తోంది. మీరు మీ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ. 6,000 తగ్గింపును కూడా పొందవచ్చు. దానితో పాటు మీరు మీ పాత ఐఫోన్‌పై రూ. 25,000 వరకు తగ్గింపు పొందవచ్చు. మంచి కండిషన్, లేటెస్ట్ మోడల్ ఐఫోన్‌కు పూర్తి డబ్బు వస్తుంది. ఆఫర్స్ అన్ని వర్తిస్తే.. మీకు ఐఫోన్‌ 14 34 వేలకే మీ సొంతం అవుతుంది. 


iPhone 14 Specifications:
ఐఫోన్ 14 ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అదనపు భద్రత కోసం ఫేస్ ID సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ మొబైల్ యాపిల్ యొక్క A15 బయోనిక్ చిప్‌తో ఆధారితమైనది కాగా.. ఇందులో 16-కోర్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU) మరియు 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసర్ ఉన్నాయి. ప్రాసెసర్ గరిష్టంగా 4GB RAMతో జత చేయబడింది. మూడు వేరియెంట్ ఎంపికలను (128GB, 256GB మరియు 512GB) ఐఫోన్ 14 కలిగి ఉంటుంది. 


iPhone 14 Camera:
ఐఫోన్ 14 డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.  ఇందులో 12MP ప్రైమరీ వైడ్ యాంగిల్ సెన్సార్, సెన్సార్-షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్ ఉంటుంది. ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్‌ని కూడా ఈ కెమెరా సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది.


Also Read: Best Mileage Cars 2023: బెస్ట్ మైలేజ్ 7 సీటర్ కార్లు ఇవే.. లీటర్‌పై 26 కిలోమీటర్లు! ధర 6 లక్షల నుంచి స్టార్ట్   


Also Read: Brezza Black Edition 2023: మారుతి సుజుకి బ్రెజా 'బ్లాక్' ఎడిషన్‌ విడుదల.. ధర ఎంతో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.