COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Best Smart Watch Under 1500: ప్రస్తుతం మార్కెట్‌లో చాలా టెక్ బ్రాండ్లు అల్ట్రా ప్రీమియం స్మార్ట్ వాచ్‌లను విక్రయిస్తున్నాయి. సాధారణ బడ్జెట్‌లో కొనుగోలు చేసే వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ప్రీమియం ఫీచర్లతో అతి తక్కువ ధరలోనే అందిస్తున్నాయి. మీరు కూడా మంచి స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం మేము ఓ ప్రత్యేక స్మార్ట్ వాచ్‌ను పరిచయం చేయబోతున్నాం. ఆ స్మార్ట్ వాచ్ ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రస్తుతం అమెజాన్ లోని ప్రత్యేక సేల్‌లో భాగంగా యాపిల్ వాచ్ అల్ట్రా లాగా లుక్‌ను కలిగి ఉన్న స్మార్ట్ వాచ్ ప్రస్తుతం రూ.1,500 కంటే తక్కువ ధరలోనే లభిస్తోంది. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో  ఫైర్-బోల్ట్ గ్లాడియేటర్ స్మార్ట్‌వాచ్‌పై  85 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ వాచ్‌పై ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి మరింత తగ్గింపు కూడా పొందే అవకాశాన్ని అందిస్తోంది అమెజాన్..


ప్రస్తుతం మార్కెట్‌లో యాపిల్ వాచ్ అల్ట్రా ధర సుమారు రూ.90,000కు పైగా ఉంది. అయితే అచ్చం ఇదే డిజైన్‌తో మెటల్ లుక్‌లో ఇటీవలే ఫైర్ బోల్ట్ కంపెనీ గ్లాడియేటర్ స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. అయితే ఈ వాచ్‌ను ఇప్పుడు అమెజాన్ తమ సాధారణ కష్టమర్స్ ను దృష్టిలో పెట్టుకొని కేవలం రూ.1,500 కంటే తక్కువ ధరలోనే విక్రయిస్తోంది.


Also Read: Google Trend Video: వీడు మగాడ్రా బుజ్జి..ఏకంగా 16 అడుగుల కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు..మీరే చూడండి.


ఫైర్-బోల్ట్ గ్లాడియేటర్ స్మార్ట్‌వాచ్‌ అసలు ధర రూ.9,999 కాగా అమెజాన్ నిర్వహిస్తున్న 'డీల్ ఆఫ్ ది డే' సేల్‌లో భాగంగా 85% తగ్గింపుతో కేవలం రూ. 1,499కే లభిస్తోంది. ఈ వాచ్‌ బ్లాక్ సిలికాన్, బ్లూ, లైట్ గోల్డ్, ఆరెంజ్, గోల్డ్ బ్లాక్ వంటి అనేక కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.


Fire-Boltt Gladiator Watch ఫీచర్స్:


  •  1.96-అంగుళాల డిస్‌ప్లే

  • 500నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌

  • 240x282 పిక్సెల్స్ రిజల్యూషన్

  • బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్

  • 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌

  • బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌


Also read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook