COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Best Soundbar With Subwoofer: దసరా పండగను దృష్టిలో పెట్టుకుని అన్ని ఎలక్ట్రిక్‌ బ్రాండ్లు అతి తక్కవ ధరలకే వస్తువులను విక్రయిస్తున్నాయి. ఫిలిప్స్ కంపెనీ కూడా తమ పరికరాలను అతి తక్కువ ధరలకు అందించే దిశగా 'ఫెస్టివల్ థెరపీ' సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని వస్తువులపై రూ. 1 డౌన్‌ పేమెంట్‌ కట్టి సొంతం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సేల్ ప్రారంభమైంది. నవంబర్ 30 వరకు కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది. అయితే ఈ డీల్‌ ఏయే వస్తువులపై అప్లికేబుల్‌ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


ఈ ప్రత్యేక డీల్‌లో భాగంగా కస్టమర్‌లు సౌండ్‌బార్స్‌, పార్టీ స్పీకర్స్‌, టవర్ స్పీకర్స్‌పై ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. మీరు వీటిని కేవలం రూ.1 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. అయితే మిగిలిన డబ్బులు వాయిదాల్లో చెల్లించుకోవచ్చు.  ముఖ్యంగా ఈ సేల్‌లో SPA9080B/94, SPA9120B మోడల్స్‌ను అతి తక్కువ ధరలకే పొందవచ్చు. 


ఫిలిప్స్ 'ఫెస్టివల్ థెరపీ' సేల్‌ కేవలం రూ.1 డౌన్‌ పేమెంట్‌ పే చేసి వీటిని కొనుగోలు చేయోచ్చు:
✾ SPA9080B/94
✾ TAPB603/94
✾ SPA9120B/94
✾ HTL8162/94
✾ TAX5206/94
✾ TAB7807/94
✾ TAB8967/94
✾ TAB7305/94
✾ TAB8947/94
✾ TAX3206/94


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


అతి తక్కువ ధరలో మంచి పార్టీ స్పీకర్‌ లేదా సౌండ్ బార్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫిలిప్స్ 'ఫెస్టివల్ థెరపీ' సేల్‌లో భాగంగా అన్ని రకాల పరికారలపై భారీ తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా రూ. 1 డౌన్ పేమెంట్ కట్టి వస్తువులను పొందే అవకాశాన్ని కూడా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్స్‌ను వినియోగించాలనుకునేవారు ఫిలిప్స్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 


ఫెస్టివల్ థెరపీ డీల్‌లో భాగంగా కంపెనీ అధికారి కంట్రీ హెడ్ అతుల్ జస్రా మాట్లాడుతూ..ఫెస్టివల్ థెరపీ అనేది కేవలం ప్రచారం మాత్రమేకాదని..శాశ్వతమైన జ్ఞాపకాలను పొందడానికి ఏర్పాటు చేసిన సేల్‌ అని పేర్కొన్నారు. ఈ సేల్‌లో భాగంగా సాధరణ కస్టమర్స్‌ కూడా అన్ని పరికరాలను సులభంగా కొనుగోలు చేయోచ్చన్నారు. 


ఫిలిప్స్ సౌండ్‌బార్ TAB8967 గురించి చెప్పనక్కర్లేదు. ప్రీమియం సౌండ్‌ క్వాలిటీతో పాటు  సినిమాటిక్ అనుభూతిని పొందే విధంగా ఈ సౌండ్‌ బార్‌ను రూపొందించారు. ఇక డిజైన్‌ పరంగా చూస్తే బ్లాక్‌ కలర్‌లో ఎంతో ఆకర్శనీయంగా కనిపిస్తుంది. ఈ బార్‌ సరౌండ్ ఆడియో ఎఫెక్ట్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు చాలా రకాల కొత్త ఫీచర్స్‌ ఇందులో అందుబాటులో ఉన్నాయి. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి