Big Year End Sale Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లోని త్వరలో బిగ్ ఇయర్ ఎండ్ సేల్..ఈ బ్రాండ్ మొబైల్స్ పై స్పెషల్ ఆఫర్స్..
Mobiles Prices Drop In Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి ఆఫర్ల జాతర ప్రారంభం కాబోతోంది. బిగ్ ఫెస్టివల్ డీల్స్‌లో భాగంగా బిగ్ ఇయర్ ఎండ్ సేల్ డిసెంబర్ 9న ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరకే లభించబోతున్నాయి..అంతేకాకుండా ఈ మొబైల్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Mobiles Prices Drop In Flipkart: ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ అన్ని రకాల వస్తువులను డిస్కౌంట్‌తో అందించేందుకు త్వరలోనే మరో సేల్‌ని ప్రారంభించబోతోంది. ఈ సేల్ డిసెంబర్ 9 నుంచి ప్రారంభమై 16వ తేదీన ముగియనుంది. ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌ను "బిగ్ ఇయర్ ఎండ్ సేల్" పేరుతో కస్టమర్స్‌కి పరిచయం చేయబోతోంది. ముఖ్యంగా ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్లు అతి తక్కువ ధరకే లభించనున్నాయి. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్ కొన్ని మొబైల్ పై నో కాస్ట్ EMI ఆప్షన్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా అందించబోతోంది. ఈ సేల్‌లో ఏయే స్మార్ట్ ఫోన్స్‌పై ప్రత్యేక డిస్కౌంట్ లభించబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా Flipkart ఈ బిగ్ ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా యాపిల్ ఐఫోన్ పై ప్రత్యేక డిస్కౌంట్ అందించబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ లభించనున్నాయి. ముఖ్యంగా యాపిల్ 14 ప్రత్యేక డిస్కౌంట్ లభించనుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ రూ.69,900తో మార్కెట్‌లో అందుబాటులో ఉండగా.. ఈ బిగ్ ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా భారీ తగ్గింపుతో లభించబోతోంది. అలాగే సాంసంగ్ ఇటీవల విడుదల చేసిన ఎస్ 22 సిరీస్ స్మార్ట్ ఫోన్‌పై కూడా ప్రత్యేక డిస్కౌంట్ అందించబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 85,999 కాగా.. ఈ సేల్‌లో భాగంగా కేవలం రూ.35,000 లోపే లభించబోతున్నట్లు సమాచారం.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
అంతేకాకుండా ఈ ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా మిడిల్ రేంజ్ బడ్జెట్లో లభించే స్మార్ట్ ఫోన్లు కూడా మరింత చౌకగా లభించబోతున్నాయి. ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ కోసం ఇన్ఫినిక్స్ ఇటీవల విడుదల చేసిన ఇన్ఫినిక్స్ హాట్ 30 ఐ అత్యంత చౌక ధరతో పొందవచ్చు..సాధారణంగా ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.11,999 అయితే, ఈ సేల్ లో భాగంగా రూ. 10,000లోపే లభించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నథింగ్ ఫోన్ 2 కూడా అతి తక్కువ ధరలోనే లభించబోతోంది.
ఇక ఈ సేల్‌లో భాగంగా గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఫ్లిఫ్‌కార్ట్ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. స్మార్ట్ ఫోన్ పై ఫ్లాట్ తగ్గింపు డిస్కౌంట్ ఆఫర్స్ తో పాటు బ్యాంక్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా లభించనున్నాయి. అలాగే మోటో ఇటీవలే విడుదల చేసిన g54 5g స్మార్ట్ ఫోన్ కూడా అతి తక్కువ ధరకే పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.21,999 కాగా ఈ సంవత్సరం చివరి సేల్‌లో భాగంగా భారీ తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా రియల్ మీ, పోకో, సాంసంగ్ యాపిల్ వివో ఇతర బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ పై కూడా డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి