Difference Between OnePlus 11 5g, OnePlus 11r 5g: వన్ ప్లస్ మొబైల్స్‌కి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ లభించింది. అయితే దీనిని అలాగే కొనసాగించేందుకు కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి లాంచ్ చేస్తోంది. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన వన్‌ప్లస్ 11 5g, వన్‌ప్లస్ 11r 5g స్మార్ట్ ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు లభించింది. చాలామంది ఈ రెండు మొబైల్స్ ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఏ మొబైల్ ఫీచర్స్, ధర పరంగా బెస్తో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వన్‌ప్లస్ 11 5g, వన్‌ప్లస్ 11r 5g మధ్య తేడాలు:
డిస్ప్లే:

ఈ రెండు మొబైల్స్ డిస్ప్లే విషయానికి వస్తే, OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల LTPO 3.0 QHD+ AMOLED డిస్ప్లేతో లభిస్తోంది. స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇక OnePlus 11R 5G మొబైల్ 6.74 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. దీని స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేస్తుంది.


ప్రాసెసర్:
ఈ మొబైల్స్ ప్రాసెసర్ విషయానికొస్తే, OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఇక OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ కూడా Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ పై నడుస్తుంది.


RAM & స్టోరేజ్:
ఈ రెండు మొబైల్స్ స్టోరేజ్ విషయానికొస్తే.. OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ 8GB, 12GB RAM, 128GB, 256GB ఇంటర్నల్ స్టోరీస్‌తో లభిస్తోంది. OnePlus 11R 5G మొబైల్ 8GB, 12GB RAM, 128GB, 256GB ఇంటర్నల్ స్టోరీజ్‌తో అందుబాటులో ఉంది.


కెమెరాలు:
OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో లభిస్తోంది. దీని బ్యాక్ సెట్‌లో 50MP (Sony IMX890) + 48MP (Sony IMX581) + 32MP (Sony IMX709) కెమెరాలు ఉంటాయి. ఇక OnePlus 11R 5G మొబైల్ వివరాల్లోకి వెళితే, ఈ మొబైల్ కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ లభిస్తుంది.  దీని బ్యాక్ లో 50MP (Sony IMX890) + 8MP + 2MP ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటాయి.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


బ్యాటరీ:
ఇక ఈ రెండు మొబైల్స్ బ్యాటరీ వివరాల్లోకి వెళితే, OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీతో పాటు 100W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో అందుబాటులోకి వచ్చాయి. ఇక OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ 5000mAh, 80W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో లభిస్తున్నాయి.


డిజైన్:
ఇక ఈ రెండింటి డిజైన్ విషయానికొస్తే,  OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ ఫ్రంట్‌లో గాజు, బ్యాక్‌లో మెటల్ ఫ్రేమ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇక OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ ఫ్రంట్ భాగంలో గాజు, వెనుక భాగంలో మాత్రం ప్లాస్టిక్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ రెండు మొబైల్స్‌ ధర వివరాల్లోకి వెళితే, OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ ధర రూ.56,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ కేవలం  రూ. 39,999 నుంచే మార్కెట్లో లభిస్తుంది. 


ఈ రెండిట్లో ఏ మొబైల్ బెస్ట్ అంటే?
ఇట్టివంతమైన డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరాలు, ఛార్జింగ్, స్పీకర్లు, వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్ కావాలనుకునేవారు OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ ఎంపిక చాలా బెస్ట్. తక్కువ ధరతో మంచి స్మార్ట్ ఫోన్ కావాలనుకునేవారు OnePlus 11R 5G మొబైల్ చాలా బెస్ట్..


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి