Redmi Note 13: ప్రముఖ చైనీస్ టెక్ బ్రాండ్ Xiaomi తమ శక్తివంతమైన ఫీచర్స్‌ కలిగిన Redmi Note  13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ అతి తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ సిరీస్‌ మొబైల్స్‌ రెడ్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ అతి తక్కువ ధరకు లభిస్తున్నాయి. అయితే ఈ Redmi Note  13 సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో రెడ్‌మీ నోట్ 13 స్మార్ట్‌ ఫోన్‌ విక్రయాలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఈ మొబైల్‌ 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 108MP కెమెరా సెటప్, పెద్ద పరిమాణం కలిగిన AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ డిస్ల్పే ప్రోటక్షన్‌ కోసం కంపెనీ గొరిల్లా గ్లాస్ 5ను కూడా అందిస్తోంది. 


Redmi Note 13 మొబైల్‌ ధర వివరాలు:
Redmi Note 13 స్మార్ట్‌ ఫోన్‌ 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌తో అందుబాటులోకి వచ్చింది. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌ డెడ్ చీప్‌ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా అమెజాన్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. 6GB RAM + 128GB స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్‌ రూ.16,999 నుంచి ప్రారంభమవుతాయి. ఇక 2GB + 256GB వేరియంట్ ధర రూ.20,999తో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే ICICI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే రూ.2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. 


Redmi Note 13 స్పెసిఫికేషన్స్‌:
6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే 
 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే
 MediaTek Dimensity 6080 ప్రాసెసర్‌
108MP + 2MP కెమెరా సెటప్
16MP selfieకెమెరా
5000mAh బ్యాటరీ
33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter