మీ భార్యా/ భర్త తరచూ ఫోన్ పగలగొడుతున్నారా..? అయితే ఈ స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్ గా ఇవ్వండి!
ప్రముఖ స్ట్రాంగ్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ డూగీ కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. దీని పేరు Doogee V30 Pro.. కిందపడ్డా.. గోడకేసి బాదిన పగలకుండా ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ మరియు ధరలు చెక్ చేయండి.
Doogee V30 Pro: స్ట్రాంగ్ ఫోన్ లను తయారు చేయటంలో పేరుగాంచిన స్మార్ట్‌ఫోన్ సంస్థ డూగీ. ఈ సంస్థ కొత్తగా అద్భుతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ పేరు Doogee V30 Pro. ఫోన్‌లో 200MP ప్రైమరీ కెమెరా, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ మరియు స్ట్రాంగ్ డిజైన్ తో తయారు చేయబడింది. ఈ ఫోన్ MediaTek Dimensity 7050 చిప్‌సెట్‌తో ఆధారితమై మరియు Android 13 పై రన్ అవుతుంది. ఇంత స్ట్రాంగ్ స్మార్ట్‌ఫోన్‌లను ఉప్పత్తి చేసే డూగీ చేసిన Doogee V30 Pro ధర, స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్లను తెలుసుకుందాం...
డూగీ V30 ప్రో స్పెసిఫికేషన్స్..
బలమైన పరికరాలతో స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయటం ద్వారా డూగీ సంస్థ మంచి గుర్తింపు సాధించింది. ఇక V30 ప్రో విషయంలో కూడా అదే జరిగింది. V30 ప్రో అనేది V30 సిరీస్‌లోని లేటెస్ట్ ఫోన్, నవంబర్ 1, 2023న లాంచ్ కానుంది. ఇది 200MP బాక్ కెమెరాను కలిగి ఉండి.. మొదటి V30 సిరీస్ మోడల్ లాగానే 6.58-అంగుళాల 120Hz FHD+ IPS ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ స్ట్రాంగెస్ట్ స్మార్ట్‌ఫోన్ Wi-Fi 6 కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్‌తో రానుంది.
V30 ప్రో డ్యూయల్ 5G సిమ్‌లకు సపోర్ట్ చేయనుంది, అనగా అంటే మీరు ఒకేసారి రెండు 5G నెట్‌వర్క్‌లను ఉపయోగించవచ్చు. ఉపదయోగపడుతుంది. అంతేకాకుండా.. ఇది 32MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది. 32MP కెమెరాతో మంచి సెల్ఫీలు కూడా తీసుకోవచ్చు. V30 ప్రో, V30 సిరీస్‌లోని ఇతర మోడల్‌ల మాదిరిగానే, లెఫ్ట్ సైడ్ లో బటన్ ఉంది.. దీని సహాయంతో మీకు నచ్చిన ఫంక్షన్‌ను నిర్వహించడానికి లేదా మీరు నచ్చిన కాన్ఫిగర్ చేయవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. V30 Pro 10,800mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఫోన్ ను ఎక్కువ సమయం ఉపయోగించటానికి సహాయపడుతుంది.
డూగీ V30 ప్రో ధర
డూగీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ V30 ప్రోని మూడు కలర్ లలో విడుదల చేసింది. ఇది ఖాకీ, సిల్వర్ మరియు బ్లాక్ కలర్‌లలో అందుబాటులో ఉండనుంది. AliExpressలో అడ్వాన్స్ ఆర్డర్ కోసం స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా.. ప్రారంభ కొనుగోలుదారులు ఉచిత 65W GaN ఫాస్ట్ ఛార్జర్ మరియు అల్యూమినియం హోల్డర్‌ను పొందనున్నారు. అమెరికాలో V30 ప్రో ధర $999 (రూ. 83,146), అయితే దేశాన్ని బట్టి స్మార్ట్‌ఫోన్ ధర మారవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..