Voltas AC Offer: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డే సేల్ తరువాత ఇప్పుడు బిగ్ దసరా సేల్ నడుస్తోంది మరోసారి వివిధ రకాల ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందిస్తోంది కంపెనీ. అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లతో ఈ ఫ్లిప్‌కార్ట్ మరోసారి కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం దసరా సేల్ నడుస్తోంది. ఈ సేల్ మరి కొద్దిగంటలే మిగిలుంది. ఈ సేల్‌లో వివిధ రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఓ ప్రముఖ కంపెనీ ఎయిర్ కండీషనర్‌పై భారీ డిస్కౌంట్ నడుస్తోంది. రానున్న వేసవి కోసం ఇప్పట్నించే సిద్ధం చేసుకోవాలనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. సాధారణంగా చలికాలంలో ఎయిర్ కండీషనర్‌ల ధరలు తగ్గుతుంటాయి. ఇప్పుడు చలికాలం కంటే ముందే ధర తగ్గింది. వోల్టాస్ కంపెనీ ఎయిర్ కండీషనర్ చాలా తక్కువ ధరకే లభించనుంది. 


Voltas 1.5 Ton 5 Star Split Inverter ACపై ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. దాదాపు సగం ధరకు పొందవచ్చు. ఈ ఎయిర్ కండీషనర్ అసలు ధర 73,990 రూపాయలు కాగా 50 శాతం డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ అనంతరం 36,490 రూపాయలకు లభించనుంది. దసరా సేల్‌లో డిస్కౌంట్ ఆఫర్లు ప్రయోజనం పొందాలంటే ఇదే మంచి ఆఫర్ కాగలదు.


వోల్టాస్ 1.5 టన్ 5 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీలో చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది 5 స్టార్ కావడంతో కరెంట్ బిల్లు ఆదా అవుతుంది. దాంతోపాటు ఆటో రీస్టార్ట్ కాపర్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. స్లీప్ మోడ్ మరో ప్రత్యేకత.


Also read: EPF Interest Credit: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, త్వరలోనే పీఎఫ్ వడ్డీ డబ్బులు మీ ఖాతాల్లో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook