Realme C30 smart phone 32 GB and 2 GB RAM variant buy Rs 6799 in Flipkart: దసరా పండగల నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్‌' భారీ ఆఫర్లకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 23 నుంచి 30 వరకు 'బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌' నిర్వహించనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ ట్యాప్‌లు, స్మార్ట్‌ వాచ్‌లు, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్‌పై భారీగా డిస్కౌంట్లు ఉండబోతులున్నాయి. అయితే బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ ఆరంభం కాకముందే.. కొన్ని బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రియల్‌మీ సీ30 (Realme C30)పై ఫ్లిప్‌కార్ట్‌ ఓ ఆఫర్ ఉంచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 'రియల్‌మీ సీ30' (Lake Blue 32 GB, 2 GB RAM) స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 8,499లుగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో 20 శాతం ఆఫర్ ఉంది. దాంతో రూ. 1700 తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ. 6,799 ధరకే మీరు సొంతం చేసుకోవచ్చు. ఇందులో 500 సూపర్ కాయిన్స్ కూడా చెల్లించే వెసులుబాటు ఉంది.


రియల్‌మీ సీ30ని కేవలం రూ. 549కే ఇంటికి తీసుకుపోవచ్చు. ఎక్స్ ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 549కే మీరు సొంతం చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్ ఛేంజ్ ఆఫర్‌ కింద రూ. 6,259 వరకు వస్తుంది. అయితే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే, పనితీరు, బ్యాటరీ బాగుండాలి. ఎలాంటి ఫిజికల్ డామేజ్ కూడా ఉండకూడదు. అన్ని బాగున్న పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ. 6,259 వస్తే.. అప్పుడు రియల్‌మీ సీ30ని కేవలం రూ. 549కే మీ సొంతమవుతుంది. 


రియల్‌మీ సీ30 ఫీచర్లు ఇవే:
# 6.5 ఇంచుల హెచ్‌డీ + డిస్‌ప్లే
# Unisoc T612 ప్రాసెసర్
# Android 11 ఆపరేటింగ్ సిస్టం
# 8MP ప్రైమరీ కెమెరా
# 5MP ఫ్రంట్ కెమెరా
# 5,000mAh బ్యాటరీ
# మైక్రో USB పోర్ట్ 
# డ్యూయల్ సిమ్


Also Read: వికెట్ల వెనకాల ఉండి ఏం **తున్నావ్.. దినేశ్‌ కార్తిక్‌పై ఫైర్ అయిన రోహిత్‌ శర్మ (వీడియో)


Also Read: Muslim Couple TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చిన ముస్లిం జంట!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.