Muslim Couple TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చిన ముస్లిం జంట!

Chennai based Muslim Couple donation to TTD. చెన్నైకి చెందిన ముస్లిం దంపతులు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు కోటి రూపాయల విరాళాన్ని అందించారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 21, 2022, 12:55 PM IST
  • తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం
  • శ్రీనివాసుడుకి విరాళం ఇచ్చిన ముస్లిం జంట
  • ఇదే మొదటిసారి కాదు
Muslim Couple TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చిన ముస్లిం జంట!

Chennai based Muslim Couple donation to TTD: భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా 'శ్రీ వేంకటేశ్వర స్వామి'కి పేరుంది. అందుకే వేంకటేశ్వర స్వామిని చాలా మంది ప్రజలు పూజిస్తారు. తమ కోరికలను నెరవేర్చినందుకు స్వామి వారికి నిత్యం ఎంతో మంది భక్తులు భారీ మొత్తాన్ని కానుకగా సమర్పిస్తుంటారు. కుల, మత బేధం లేకుండా.. విష్ణువు యొక్క కలియుగ అవతారం అయిన శ్రీనివాసుడుకి విరాళం ఇస్తుంటారు. తాజాగా ఓ ముస్లిం జంట వేంకటేశ్వర స్వామికి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. 

చెన్నైకి చెందిన సుబీనా బాను, అబ్దుల్ ఘనీ అనే ముస్లిం దంపతులు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి పొందిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు కోటి రూపాయల రెండు లక్షల విరాళాన్ని అందించారు. కొత్తగా నిర్మించిన పద్మావతి విశ్రాంతి గృహానికి సంబంధించిన ఫర్నిచర్, పాత్రల కోసం రూ.87 లక్షలు విరాళం ఇచ్చారు. అలాగే ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.15 లక్షలు ఇచ్చారు.  టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎవి ధర్మారెడ్డి చెక్కు రూపంలో ఈ మొత్తంను అందజేశారు. 

భారీ విరాళం ఇచ్చిన సుబీనా బాను, అబ్దుల్ ఘనీ దంపతులకు టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎవి ధర్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ముస్లిం దంపతులకు టీటీడీ వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆపై ఆలయ అధికారులు అబ్దుల్ ఘనీ కుటుంబ సభ్యులకు తీర్ధప్రసాదాలు అందజేశారు. అబ్దుల్ ఘనీ టీటీడీ ఆలయానికి విరాళం ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆలయ ప్రాంగణంలో క్రిమిసంహారక మందులను పిచికారీ చేయడానికి మల్టీ డైమెన్షనల్ ట్రాక్టర్-మౌంటెడ్ స్ప్రేయర్‌ను విరాళంగా ఇచ్చారు.

Also Read: శని మహాదశతో 19 సంవత్సరాలు కష్టాలే.. ఈ పరిహారం చేస్తే పట్టిందల్లా బంగారమే!

Also Read: ఈ బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఏందిరా సామీ.. టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీ దేవుడెరుగు కానీ తొలి రౌండ్‌ కూడా కష్టమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News