Poco C55 Price In India: ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫారం ఫ్లిప్‌కార్ట్‌లో పండగ సేల్ ప్రారంభమైంది.. వినాయక చవితి సందర్భంగా ఎలక్ట్రిక్ వస్తువులపై 20 నుంచి 30 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్‌లు ప్రత్యేక డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. ఈ ఆఫర్లలో భాగంగా స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసే వారికి బ్యాంక్ ఆఫర్లను కూడా అందుబాటులో ఉన్నాయి. అత్యంత తగ్గింపుతో మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం గా భావించవచ్చు. ప్రముఖ టెక్ కంపెనీ పొకో ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన C55 స్మార్ట్ ఫోన్ పై ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో? వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వినాయక చవితి ఆఫర్స్ లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో పోకో సి55 మొబైల్ కొనుగోలు చేస్తే దాదాపు 39 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. మొదటగా ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ ధర రూ. 13,999కే విక్రయించేది. పండగలో భాగంగా ఈ మొబైల్ ను రూ.8,499కే అందిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ ను మరింత తగ్గింపు ధరకు పొందడానికి అదనంగా బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. మీరు ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి బిల్ చెల్లిస్తే రూ. 1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. 


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  


అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్లలో భాగంగా..పోకో సి55 మొబైల్ అదనపు తీసుకోండి పొందడానికి..IDFC క్రెడిట్ కార్డు ద్వారా కూడా బిల్లు చెల్లిస్తే రూ.1,500 వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన దాదాపు ఐదు శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. మరింత అదనపు డిస్కౌంట్ పొందడానికి ఈ స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్కార్ట్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. మీ వద్ద ఉన్న పాత స్మార్ట్ ఫోన్ ఈ ఎక్స్చేంజ్ ఆఫర్లలో భాగంగా ఎక్స్చేంజ్ చేసి రూ.7,600 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో మీకు ఈ స్మార్ట్ ఫోన్ రూ.899కే పొందవచ్చు.


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook