Realme Narzo 60X 5G Price: రూ.11,000లోపే AI 50MP బ్యాక్ కెమెరా కలిగిన Realme Narzo 60x 5G మొబైల్..అద్భుతమైన ఫీచర్స్ మరెన్నో..
Realme Narzo 60X 5G Price: రియల్ మీ నుంచి త్వరలోనే మిడిల్ రేంజ్లో మరో స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది. ఈ మొబైల్ ఫోన్ Realme Narzo 60x 5G పేరుతో లాంచ్ కాబోతోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
Realme Narzo 60X 5G Price: పస్తుతం మిడిల్ రేంజ్ బడ్జెట్ కలిగిన స్మార్ట్ ఫోన్స్‌కి మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీలు బడ్జెట్ ధరల్లో మొబైల్ ఫోన్స్‌ను విడుదల చేస్తున్నాయి. అయితే ప్రముఖ టెక్ కంపెనీ రియల్ మీ కూడా త్వరలోనే మిడిల్ రేంజ్ బడ్జెట్‌లో మరో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. కంపెనీ Realme Narzo 60x 5G పేరుతో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఈ మొబైల్ ఫోన్ ప్రీమియం డిజైన్, కూల్ ఫీచర్లతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం.
త్వరలోనే విడుదల కాబోయే Realme Narzo 60x 5G స్మార్ట్ ఫోన్ 50MP AI కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా మొదటి సేల్‌లోనే కొనుగోలు చేసేవారికి ప్రత్యేక ఆఫర్‌ను కూడా అందిచబోతోంది కంపెనీ. అయితే ఈ మొబైల్ ఫోన్‌ను ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో సెప్టెంబర్ 12వ తేదిన విడుదల చేయబోతోంది. ఇదే రోజు ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి అదనంగా రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
Realme Narzo 60x 5G ధర, ఆఫర్ల వివరాలు:
రియల్ మీ సెప్టెంబర్ 12న విడుదల చేయబోతున్న స్మార్ట్ ఫోన్‌లను రెండు వేరియంట్‌లో కస్టమర్స్‌కి అందించబోతోంది. రియల్ మీ Narzo 60x 5G 4GB RAM + 128GB స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ రూ.12,999లకు లభించబోతోంది. ఇక 6GB RAM + 128GB వేరియంట్ రూ.14,499 ధరతో విడుదల చేయబోతోంది. ఈ రెండు మొబైల్ ఫోన్స్‌ని అమెజాన్ అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేస్తే మొదటి సేల్‌లో రూ. 1000 అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది.
Realme Narzo 60x 5G స్పెసిఫికేషన్‌లు:
6.72 అంగుళాల IPS LCD డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్
680nits పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్
MediaTek డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్
6GB ఇన్‌స్టాల్ + 6GB వర్చువల్ RAM
RealmeUI 4.0 సాఫ్ట్‌వేర్ స్కిన్
50MP బ్యాక్ కెమెరా
AI డ్యూయల్ కెమెరా సెటప్
2MP డెప్త్ సెన్సార్ కెమెరా
సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16MP AI కెమెరా
5000mAh బ్యాటరీ
33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి