Honor 9Xb Phone: 108 మెగాపిక్సెల్ కెమేరా, 8జీబీ ర్యామ్‌తో హానర్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్
Honor 9Xb Phone Price and Features: అద్బుతమైన ఫీచర్లు కలిగిన బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తుంటే ఇదే మంచి అవకాశం. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హానర్ నుంచి ఊహించని ఫీచర్లతో ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్‌పై ప్రారంభ ఆఫర్‌లో భాగంగా డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.
Honor 9Xb Phone Price Details: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ నుంచి Honor X9b లాంచ్ అయింది. అద్భుతమైన కెమేరా, ర్యామ్, అత్యధిక బ్యాటరీ సామర్ధం ఈ ఫోన్ ప్రత్యేకత. ప్రస్తుతం ఈ కామర్స్ వేదిక అమెజాన్‌లో విక్రయాలు జరుగుతున్నాయి. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా 3 వేల రూపాయలు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Pregnant Woman Tips: సమ్మర్ లో గర్భిణీలు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి..
Honor X9b స్మార్ట్‌ఫోన్ 6.78 ఇంచెస్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో పాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా అల్ట్రా బౌన్స్ యాంటీ డ్రాప్ 360 డిగ్రీస్ టెక్నాలజీ ఉండటం వల్ల నిర్ణీత ఎత్తు 1.5 మీటర్ల నుంచి కిందకు పడినా డ్యామేజ్ కాదు. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్ కలిగి ఉంటుంది. ఇందగులో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉండటంతో ఫోన్ పనితీరు చాలా వేగంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. కేమేరా విషయానికొస్తే చాలా అద్బుతమని చెప్పవచ్చు. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమేరాతో త్రిబుల్ కెమేరా సెటప్ ఉంటుంది. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది.
Honor X9b స్మార్ట్‌ఫోన్‌లో 5800 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉండటంతో ఎక్కువసేపు పనిచేస్తుంది. సింగిల్ ఛార్జింగ్‌తో రోజంతా వినియోగించుకోవచ్చు. ఈ ఫోన్‌తో పాటు 30 వాట్స్ ఛార్జింగ్ అడాప్టర్ ఉచితంగా లభిస్తుంది. Honor X9b ప్రస్తుత ధర 25,999 రూపాయలు కాగా హెచ్‌డిఎఫ్‌సి, ఎస్బీఐ, ఐసీఐసీఐ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 3000 రూపాయలు తక్షణ డిస్కొంట్ పొందవచ్చు. అంటే కేవలం 22 వేల 999 రూపాయలకే లభిస్తుంది. ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగిస్తే మరో 5000 రూపాయలు తగ్గుతాయి. అంటే 17,999 రూపాయలకు అందుబాటులో రానుంది.
Also Read: Anaparti Effect: అనపర్తి కూటమి కొంపముంచనుందా, వైసీపీ నెత్తిన పాలు పోసిన పొత్తు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి