Anaparti Effect: ఏపీ ఎన్నికల వేళ తూర్పు గోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ స్థానం కూటమికి రెండు విషయాల్లో మైనస్‌గా మారింది. అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పార్లమెంట్ నియోజకవర్గంపై కూడా ప్రతికూల ప్రభావం చూపించనుంది. పొత్తులో భాగంగా అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకు కేటాయించడమే కాకుండా శివకృష్ణంరాజు అనే వ్యక్తికి ఇచ్చారు. దాంతో టికెట్ తనదే అనుకున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్గం భగ్గుమంది. వాస్తవానికి కూటమిలో బీజేపీ చేరకముందు జనసేన-టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో అనపర్తి నుంచి టీడీపీ అభ్యర్ధిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరునే ప్రకటించారు. కానీ తరువాత జరిగిన పరిణామాల్లో అనపర్తి స్థానాన్ని బీజేపీకు వదులుకుంది టీడీపీ.
దాంతో రామకృష్ణారెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసనలు కొనసాగిస్తోంది. పార్టీ పెద్దలు వెళ్లి కలిసినా, అధికారంలో వస్తే మరోలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా రామకృష్ణారెడ్డి మెట్టు దిగడం లేదు. తనకు అన్యాయం జరిగిందంటూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి నల్లమిల్లి కుటుంబం గత 40 ఏళ్లుగా తెలుగుదేశంలోనే ఉంది. ఆయన తండ్రి నల్లమిల్లి మూలారెడ్డి రెండు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచే ఎన్నికయ్యారు. ఆ తరువాత 2014లో ఆయన వారసుడిగా రామకృష్ణారెడ్డి విజయం సాధించారు.
అంతటి ముఖ్యమైన వ్యక్తికి టికెట్ కాదని బీజేపీకు కేటాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డ నెత్తిన పాలుపోసినట్టేనని అందరూ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో గెలిచిన వైసీపీ అభ్యర్ది ఈసారి అంతకు రెట్టింపు మెజార్టీ సాధించవచ్చని అంచనా ఉంది. అనపర్తి స్థానం బీజేపీకు కేటాయించడం కేవలం అనపర్తికే పరిమితం కాకుండా రాజమండ్రి పార్లమెంట్ స్థానంపై కూడా ప్రతికూల ప్రభావం చూపించనుంది.
ఎందుకంటే రాజమండ్రి పార్లమెంట్ స్థానం విజయం చాలావరకూ అనపర్తిపైనే ఆధారపడి ఉంటుంది. గతంలో ఉండవిల్లి అరుణ్ కుమార్ గెలిచినప్పుడు, మురళీమోహన్ గెలుపోటములు అన్నింటీకీ అనపర్తే కారణం. 2009లో రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 5 ఓడిపోయినా రాజమండ్రి పార్లమెంట్ మాత్రం కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. దీనికి కారణం అనపర్తిలో లభించిన మెజార్టీనే. ఆ తరువాత 2014లో మురళీమోహన్ గెలుపుకు, 2019లో ఆయన కోడలు ఓటమికి కారణం కూడా అనపర్తి నియోజకవర్గమే. అందుకే ఈసారి కూడా రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్ది బీజేపీకు చెందిన పురంధరేశ్వరిపై పడనుందని తెలుస్తోంది.
అనపర్తి స్థానం బీజేపీకు కేటాయించడం అనపర్తి వైసీపీ అభ్యర్ధి, రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ అభ్యర్ది విజయానికి దారి తీస్తుందని కచ్చితంగా అంచనా వేస్తున్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దారిలో రాకుంటే జరిగేది ఇదేనంటున్నారు.
Also read: Pawan Kalyan Fever: పవన్ కల్యాణ్‌కు అస్వస్థత.. యాత్రను వదిలేసి హుటాహుటిన హైదరాబాద్‌కు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook