Iphone 15 Pre-booking Sale Starts: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ రానే వచ్చింది. ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ బుకింగ్ సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్ లో భాగంగా ఇటీవలే యాపిల్ కంపెనీ విడుదల చేసిన ఐఫోన్ 15 సిరీస్ కు సంబంధించిన ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్స్ ను ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 సేల్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ప్రీ బుకింగ్ సేల్ కూడా ప్రారంభించింది. ఈ సేల్ లో భాగంగా ఐఫోన్ 15 మూడు రకాల వేరియంట్లలో లభిస్తోంది. ఇక ఐఫోన్ 15 ప్లస్ విషయానికొస్తే.. 20 కి పైగా రంగుల్లో మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. ఇక ఐఫోన్ 15 విషయానికి వస్తే..128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ ను కంపెనీ రూ.79,900కు విక్రయించబోతోంది.


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  


ఐఫోన్ 15 256 GB, 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ లలో కూడా లభిస్తున్నాయి. ఇక ఐఫోన్ 15 ప్లస్ విషయానికొస్తే..ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్ ఫోన్ మొత్తం ఐదు రంగులతో పాటు మూడు వేరియంట్లలో లభిస్తోంది. 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.89,900తో ప్రారంభం కాబోతోంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది. మీరు ఈ మొబైల్స్‌ను తక్కువ ధరకే పొందాలనుకుంటే అదనంగా బ్యాంక్ ఆఫర్స్ వినియోగించాల్సి ఉంటుంది. ఈ బ్యాంక్ ఆఫర్స్ కి సంబంధించిన అన్ని వివరాలు మనం తెలుసుకుందాం. 


ఐఫోన్ 15 మోడల్‌ని ఫ్లిప్‌కార్ట్‌లో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 5,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఆఫర్ ను డెబిట్ కార్డు పై కూడా అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌..ఇక రెండవ బ్యాంక్ ఆఫర్ విషయానికొస్తే..ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి బిల్లు చెల్లిస్తే దాదాపు 5% డిస్కౌంట్ లభిస్తుంది. ఈ మొబైల్లో మరింత తగ్గింపుతో కొనుగోలు చేయాలనుకునే వారికి అదనంగా ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీని కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook