COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Itel S23 Plus Price: ప్రముఖ చైనీస్‌ కంపెనీ టెక్ బ్రాండ్ ఐటెల్‌ త్వరలోనే మరో స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ మొట్టమొదటి సారిగా కర్వ్డ్ డిస్‌ప్లేతో విడుదల చేయబోతోంది. కంపెనీ ఇప్పటికే ఈ స్మార్ట్‌ ఫోన్‌ పేరును కూడా వెల్లడించింది. itel S23+ పేరుతో మార్కెట్‌లోకి లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ సెగ్మెంట్‌లో తొలిసారిగా ఈ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ 3D కర్వ్డ్ డిస్‌ప్లే, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కాన్, 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


అతి తక్కువ బడ్జెట్‌లోత NFC కనెక్టివిటీని కలిగి ఉన్నమొదటి బడ్జెట్ ఫోన్‌గా చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ ర్యామ్‌ సామర్థ్యాన్ని పెంచేకునేందుకు వీలుగా మెమ్‌ఫ్యూజన్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌  గరిష్టంగా 16GB RAM + 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ దాదాపు రెండు సంవత్సరాల పాటు వారంటీని అందిస్తోంది. దీంతో పాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను కూడా అందిస్తోందని కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు itel S23+ స్మార్ట్‌ఫోన్‌  డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌తో పాటు చాలా రకాల కొత్త ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


itel S23+ ధర వివరాలు:
ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోతున్నట్లు ప్రకటించింది. కంపెనీ 16GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999లతో విక్రయించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ని లేక్ సియాన్, ఎలిమెంటల్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 


itel S23+ స్పెసిఫికేషన్‌లు:
6.78 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే 
500నిట్స్ బ్రైట్‌నెస్‌ సమర్థ్యం
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌
3డి కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
Unisoc టైగర్ T616 ప్రాసెసర్
Android 13 ఆధారంగా itelOS 13
50MP AI డ్యూయల్ కెమెరా
5000mAh బ్యాటరీ
18W ఛార్జింగ్ సపోర్ట్‌


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి